Sorry: చిన్న చిన్న తప్పులకు చాలా మంది క్షమించమని అడుగుతుంటారు. కొందరు ఎంత పెద్ద తప్పు చేసినా సారీ చెప్పాలంటే అహం అడ్డు వస్తుంటుంది. తప్పు వారి వైపు ఉన్నా కూడా తప్పును ఒప్పుకునే మనస్థత్వం వారికి ఉండదు. ఇలాంటి వారితో చాలా కష్టం. బయట వారికి సారీ చెప్పకపోయినా ఇంట్లో వారికి సారీ చెప్పడం వల్ల బంధం బలపడుతుంది. ఈ సారీ అనే ఒక పదం ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తుందో తెలుసా?
క్షమించమని అడగడం వల్ల మీరు తక్కువ అయినట్టు ఫీల్ అవకండి. మీ బంధాన్ని బలపరుచుకోవడానికి మీరు చేస్తున్న బెస్ట్ మాట ఈ సోరీ. క్షమించమని అడగడం వల్ల ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ మాట చెప్పకపోతే ఒక బంధమే దూరం అవుతుంటుంది. సోరీ అని చెప్పడం వల్ల మీరు కావాలి అనుకునే వ్యక్తి దగ్గర నుంచి మీ రిలేషన్ ను మీరు కోరుకుంటున్నట్టు. కాపాడుకుంటున్నట్టు. మీరు చేసిన పని కరెక్ట్ అయినా మీరు క్షమించమని అడిగారు అంటే మీకు ఇక తిరుగులేదు. కానీ ఎదుటి వారు దాన్ని చులకనగా చూడకూడదు.
కొన్ని సార్లు మీ రిలేషన్ ను కాపాడుకోవాలి అంటే మన వైపు కరెక్ట్ గా ఉన్నా సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ కావాలి అనుకుంటే సారీ చెప్పడంలో తప్పు లేదు. కానీ ప్రతి సారీ మీరే సారీ చెప్పాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. చిన్న పదమే కానీ ఎన్నో బంధాలను దగ్గర చేస్తోంది. ఒక్కసారి మీరు ఎన్నో రోజులుగా, నెలలుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తికి సారీ చెప్పండి. కరిగిపోతారు. వారి నుంచి మీరు రిలేషన్ కోరుకుంటే కేవలం సారీ అనే చిన్న పదం చాలు. కానీ జాగ్రత్త తప్పదు. ప్రతి సారీ ఈ పదం వాడాల్సి వస్తే మాత్రం ఆలోచించాల్సిందే.
ఎదుటి వారి మనస్తత్వాన్ని బట్టి మీ క్షమాపణ ఉండాలి. ఆ వ్యక్తి మనస్తత్వం మంచిది అయితే మిమ్మల్ని కోరుకుంటుంటే.. మీ మీద ప్రేమ ఉంటే మీరు ఒకసారీ సారీ చెప్పండి. వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తారు. మీ సారీ కోసమే వారు ఎదురుచూస్తూ ఉంటారు కూడా. సో ఆల్ ది బెస్ట్ విత్ సారీ