Extramarital Affair: ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు పక్క దారులు తొక్కుతున్నాయి. జీవిత భాగస్వామిని కాదని పరాయి వారితో గడిపేందుకు ఇష్ట పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలేంటి? మనిషిలో ఎందుకు అంత విపరీత ధోరణి వస్తోంది. ఎందుకు ఇతరులను కోరుకుంటున్నారు. అంటే పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందనే ధ్యాసతోనే అలా చేస్తారని చెప్పేవారు. కానీ కాలం మారింది. పరిస్థితులు కూడా మారాయి. అయినా మనిషిలోని గుణం మాత్రం మారడం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా అక్రమ సంబంధాల లీలలు పెరుగుతున్నాయి. సమాజంలో వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది.

మనిషిలో శృంగార కాంక్ష ఎక్కువే. తన కోరికలను తీర్చుకునే క్రమంలో అతడు ఎన్నో దారులు వెతుక్కుంటాడు. భార్యతో తృప్తి లేక పరాయి మహిళతో సంబంధం పెట్టుకుంటాడా? కారణాలేవో కానీ వివాహేతర సంబంధం మాత్రం కొనసాగుతుంది. దొరికితే పరిస్థితి వేరేలా ఉంటుంది. అయినా తన జిహ్వ చాపల్యాన్ని చంపుకోవడం లేదు. పరాయి వారితోనే బాగుందని అనుకుంటున్నాడో ఏమో కానీ ప్రస్తుతం వాటి సంఖ్య నానాటికి పెరుగుతోంది.
అసహజ సెక్స్ సంబంధాలపై అధ్యయనం చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొందరు తమ భార్య సహకరించదని చెబితే మరికొందరు తనకు పత్ని దగ్గర సరైన సుఖం లేదని చెబుతున్నారు. దీంతో విచ్చలవిడి తనం పెరుగుతోంది. ఫలితంగా నేరాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఎన్నాళ్లు సాగుతుందని రంకుతనం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది అప్పుడు వారి బాగోతం అందరికి తెలిసి బాధ పడుతుంటారు.

ఈ నేపథ్యంలో మానవసంబంధాల్లో వివాహమే పవిత్రమైనది. మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉండాలనే మన పూర్వీకులు వివాహం అనే బంధాన్ని తెచ్ారు. దానికి ప్రస్తుతం తూట్లు పొడుస్తున్నారు నాతిచరామి అని ప్రమాణం చేసి పరాయి మహిళతోనే కాలం గడుపుతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలు తుంగలో తొక్కి ఇప్పటి సుఖానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనిషిలో మార్పు రావాలి. తన భార్యతోనే కాలం గడిపేందుకు నిర్ణయించచుకోవాలి. తన భర్తే సర్వస్వం అని భార్య కూడా మసలుకోవాలి. అప్పుడే వీటికి అడ్డుకట్ట పడుతుందనే విషయం అందరు గ్రహించాలి.
Also Read:KCR: కేసీఆర్ మకాం ఇకపై ఢిల్లీలోనే.. కేంద్రంపై కోట్లాడుడేనట?