General coaches in train: ప్రతిరోజు కోట్ల మంది ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు. కొందరు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ప్రతిరోజు ట్రైన్ లోనే వెళుతూ ఉంటారు. మరికొందరు దూర ప్రయాణాలు చేయడానికి రైలు ప్రయాణం ఎంపిక చేసుకుంటారు. అయితే ట్రైన్ జర్నీ చేసే సమయంలో చాలామంది తమ టికెట్స్, ప్రయాణం గురించి మాత్రమే ఆలోచిస్తారు. రైలు గురించి ఎప్పుడు ఆలోచించరు. రైలులో ఎన్ని భోగీలు ఉంటాయి? ఇవి ఏ రకమైన బోగీలు? అనేవి కొందరు మాత్రమే తెలుసుకుంటారు. వాస్తవానికి ట్రైన్ జర్నీ చేసేముందు అన్ని విషయాలపై అవగాహన ఉంచుకోవాలి. అప్పుడే కొన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ట్రైన్ జర్నీలో ఓ విషయాన్ని కూడా ఎప్పుడూ గమనించాలి. అదేంటంటే?
Also Read: ఇండియన్ మార్కెట్లో టెస్లా నిలబడగలదా?
రేర్ గా ట్రైన్ జర్నీ చేసేవాళ్లు కేవలం రిజర్వేషన్ చేసుకొని వాటి ద్వారా ప్రయాణం చేస్తారు. కానీ కొందరు మాత్రం రెగ్యులర్గా స్టేషన్లో టికెట్ తీసుకొని జనరల్ బోగీలో ఎక్కి ప్రయాణం చేస్తారు. అయితే ఈ జనరల్ బోగీలు ట్రైన్ కు ముందువైపు కాని.. లేదా పూర్తిగా వెనుకవైపు కాని ఉంటాయి. మధ్యలో మాత్రం ఉండవు. అలా ఎందుకు ఉండవు అనే విషయం చాలామందికి సందేహం రాకపోవచ్చు. కానీ అలా జనరల్ బోగీలు ముందు లేదా వెనకకు ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
ఒక ట్రైన్ లో 12 నుంచి 24 భోగీలు ఉండే అవకాశం ఉంది. వీటిలో టూ టైర్, త్రీ టైర్, రిజర్వేషన్ తో పాటు జనరల్ బోగీలు ఉంటాయి. ఒక భోగిలో మొత్తం స్టోరేజీ ఉంటుంది. అయితే జనరల్ బోగీలు పూర్తిగా వెనకవైపు లేదా పూర్తిగా ముందువైపు కాని ఉంటాయి. వివిధ భోగిలతో రైలు పొడుగ్గా ఉంటుంది. దీంతో ఇది ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండేలా అధికారులు చూస్తారు. అంటే మిగతా భోగిల్లో కంటే జనరల్ బోగీలో ఎక్కువమంది ప్రయాణం చేస్తారు. అంతేకాకుండా జనరల్ బోగీలో ప్రయాణికులు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. దీంతో దీని బరువు ఒకేలా ఉండదు. అయితే ఈ భోగీలు ముందువైపు లేదా వెనుక వైపు ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అలాకాకుండా మధ్యలో ఉంటే ట్రైన్ బ్యాలెన్స్ తప్పుతుంది.
ఏసీ, రిజర్వేషన్ బోగీలో ప్రయాణికులు ఒకే మాదిరిగా ఉంటారు. వీరు నిర్ణిత దూరాన్ని ఎంచుకొని ప్రయాణం చేస్తారు. అందువల్ల రిజర్వేషన్ టికెట్ తీసుకున్న వారు ఎక్కుతూ దిగే వారు ఉండరు. దీంతో ట్రైన్ బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది. అందువల్ల వీటిని ఎప్పుడు మధ్యలోనే వస్తారు.
Also Read: కశ్మీర్ శాస్త్రవేత్తల విజయం.. ఇక మటన్ గురించి చింతలేదు
అంతేకాకుండా జనరల్ బోగీలు ఎప్పుడూ ప్రయాణికులతో ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. అయితే వీటిలో ప్రయాణికులు ఎక్కడానికి సౌకర్యవంతంగా ముందు లేదా వెనుక వైపు వస్తారు. ఒకవేళ మధ్యలో ఉంచితే.. ఏసీ లేదా రిజర్వేషన్ బోగీలో ఎక్కి జనరల్ బోగీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలా ప్రయాణికుల మధ్య ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల జనరల్ బోగీలను ఎటో ఒకవైపు మాత్రమే వస్తారు. అయితే కొన్ని ట్రైన్లు మాత్రం మొత్తం జనరల్ భోగిలతోనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఎటువంటి సమస్య ఉండదు.