Husband And Wife Relationship: సాధారణంగా పెళ్లి అనే బంధంతో భార్యాభర్తలుగా జీవితాంతం ఒకటై జీవిస్తారు. వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి జీవితంలో భాగస్వామిని ఆహ్వానిస్తారు. అయితే వివాహం జరిగిన తరువాత భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.
అయితే పెళ్లి తరువాత భర్తలను భార్యాలు తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే భార్యలు ఆ విధంగా ఎందుకు చేస్తారనేది మాత్రం చాలా మందిలో ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది భర్తలు తమ భార్యల మాట వినరు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే ఒకరి మాటను మరొకరు వినాలని పెద్దలు చెబుతుంటారు.
మామూలుగా ఆడవాళ్లు తమ మాటలను భర్తలు వినాలని కోరుకుంటారు. భర్త ప్రేమను పొందడంతో పాటు తనకు లొంగి ఉండాలంటే ఏం చేయాలన్నది అర్థంకాని ప్రశ్నగా మిగిలిందనుకోవచ్చు. ప్రధానంగా ఎటువంటి సందర్భంలో అయినా భర్తను తక్కువగా చేసి మాట్లాడకూడదు. అలాగే భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద మాట్లాడకూడదు. దాంతోపాటు వారి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఎక్కడ ముచ్చటించకూడదట. ఈ విధంగా చేయడం వలన భర్త కూడా భార్యకు గౌరవం ఇస్తూ తన మాటను వింటారట. భర్త చెప్పేది వింటూనే అతని కళ్లల్లోకి చూసి మాట్లాడటం వలన భార్యలు చెప్పే విషయాలను వారు వినడం ప్రారంభిస్తారట.
ప్రేమగా చూసుకోవడంతో పాటు తనకేం కావాలో ముందుగానే భార్య గ్రహించగలగాలి. తల్లి కొడుకును ఏ విధంగా చూసుకుంటుందో భర్తకు కూడా అలానే చూసుకోవాలని చెబుతున్నారు. ఇతరుల ముందు ఎక్కువగా నవ్వకూడదు. అలాగే రుచికరమైన వంటను చేసి అమ్మలా వడ్డించాలట. ఈ విధంగా చేయడం వలన భర్త మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పని గురించి కూడా భార్యకు చెబుతాడట. ఈ విధంగా చేయడం వలన భర్తలు కచ్చితంగా భార్యల మాటలను వింటారని తెలుస్తోంది.
ప్రేమ వల్ల కావచ్చు.. బంధాన్ని నిలుపుకోవడం వల్ల.. మంచి కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం భర్తను సరైన దారిలో నడిపించాలనే భావనతో భార్యలు ఇలా భర్తలను కంట్రోల్ లో పెట్టుకుంటారు. చెడు తిరుగుళ్లకు పోకుండా.. ఇతర వ్యవహారాలకు దూరంగా ఉంచేందుకు.. జీవితంలో ఎదగడం కోసం భర్తలపై నిఘా పెడుతూ కంట్రోల్ లో పెట్టుకుంటారు.