Amazing Facts: ట్రైన్ జర్నీని అందరూ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే చాలా స్పీడుగా వెళ్తుంది, అలాగే బస్సులాగా ఎత్తేయడం లాంటివి ఉండదు. పైగా తింటూ కావాలంటే పడుకుంటూ కూడా ప్రయాణం చేయొచ్చు. కాగా ట్రైన్ జర్నీ చేసే వాళ్లు చాలామంది ఒక విషయాన్ని గమనించి ఉండదు. అదేంటంటే ట్రైన్ చివరి భోగీ మీద X అనే గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసుకోరు. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉంది.

ప్రతి ట్రైన్ చివరి భోగీ మీద X అనే గుర్తు ఎరుపు లేదంటే తెలుపు లేదంటే పసుపు రంగులో చాలా పెద్దగా ఉంటుంది. దూరం నుంచి చూసినా చాలా క్లారిటీగా ఇది కనిపిస్తుంది. అయితే ఈ గుర్తు ఉంటే అది చివరి భోగీ అని రైల్వే అధికారులు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ గుర్తు ఉన్న భోగీ ఉంటే ట్రైన్ అన్ని భోగీలతో కలిసి వెళ్తోందని స్టేషన్ లో పనిచేసే వ్యక్తి కన్ఫర్మ్ చేసుకుంటాడు.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
ఒకవేళ ఈ గుర్తు కనిపించకపోతే ట్రైన్ అన్ని భోగీలతో వెళ్లట్లేదని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాడు. దాంతో వారు ఆ రూట్లో వచ్చే ట్రైన్ లను ఆపేసి, భోగీలు ఎక్కడ విడిపోయాయో గుర్తిస్తారు. అంతే కాకుండా ఈ ట్రైన్ వెనకాల ఓ రెడ్ లైట్ కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో ఎక్స్ అనే గుర్తు కనిపించదు కాబట్టి.. ఈ రెడ్ లైట్ ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి వెలుగుతుంది. దాన్ని బట్టి ట్రైన్ అన్ని భోగీలతో వెళ్తోందని రైల్వే అధికారులు నిర్ణయిస్తారు.

ఇక భోగీ వెనకాల X, రెడ్ లైట్ తో పాటు LV అనే గుర్తులు కూడా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే.. లాస్ట్ వెహికల్. ఈ గుర్తు ఉన్న భోగీ చివరది అని అర్థం. ఇది ఉన్నదంటే ట్రైన్ చివరి భోగీతో సహా సేఫ్ గా వెళ్తోందని అధికారులు గుర్తిస్తారు. ఇది చాలా ఏండ్ల నుంచి వస్తున్న పద్ధతి. కాగా రాను రాను వీటిల్లో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?