D-Mart and Reliance Smart: ఒకప్పుడు ఇంటి సరుకులు కావాలంటే బజార్లోని కిరాణం షాపులకు వెళ్లేవారు. వారానికి సరిపడా వస్తువులను కొనుగోలు చేసి తీసుకువచ్చేవారు. అయితే ఇలా వెళ్లినవారు అవసరం ఉన్న వస్తువులను మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు చిన్న పట్టణాలకు సైతం పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వెళ్తున్నాయి. ఇలా వెళ్లడంతో గ్రామీణులు సైతం షాపింగ్ మాల్స్లో సరుకులు లేదా వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 100 రూపాయల వస్తువు కొనుగోలు చేయడానికి వెళ్లి 3000 రూపాయల బిల్ తో తిరిగి వస్తున్నారు. వారికి తెలియకుండానే అనేక రకాల వస్తువులు షాపింగ్ మాల్స్ లో కొని ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? షాపింగ్ మాల్స్ వారు చేసే ట్రిక్ ఏంటి?
డీ మార్ట్, రిలయన్స్ వంటి సంస్థలు పెద్దపెద్ద స్టోర్లను ఏర్పాటు చేస్తుంటాయి. రిలయన్స్ కంటే డి మార్ట్ దేశంలో దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంది. అయితే డి మార్ట్ లో ఎక్కువ సరుకులు కొనుగోలు చేసేలా కొన్ని రకాల ప్రణాళికలు వేస్తారు. దీంతో వినియోగదారుడు తనకు తెలియకుండానే అదనంగా వస్తువులను కొనుగోలు చేస్తాడు.
సరుకుల ట్రిక్:
మనం షాపింగ్ మాల్ లోకి వెళ్ళగానే ముందుగా ఆకర్షణీయమైన వస్తువులు.. డిస్కౌంట్ లభించే దుస్తులు కనిపిస్తాయి వాస్తవానికి ఇందులోకి ఇంటి సరుకుల కోసం వెళ్తారు. కానీ వాటిని చివరగా ఉంచుతారు. ఎందుకంటే వాటికోసం వెళ్లేముందు వీటిని చూపిస్తారు. కొంతమంది వినియోగదారులు ఆకర్షణకు గురై డిస్కౌంట్ లభించే వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే చిన్న పిల్లలకు సంబంధించిన ఫుడ్స్ కింది రాక్ లో ఉంచుతారు. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ లోకి వెళ్లినప్పుడు చిన్న పిల్లలు వెంటనే వాటిని పట్టుకొని కొనిపించాలని ఏడుస్తారు. ఇలా పిల్లల అవసరం కోసం వాటిని అనుకోకుండానే కొనుగోలు చేస్తారు.
టైం ట్రిక్:
మీరు ఎప్పుడైనా గమనించారా? షాపింగ్ మాల్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ గోడ గడియారం కనిపించదు. ఎందుకంటే సమయం చూస్తూ ఉంటే టెన్షన్ మొదలై వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా షాపింగ్ మాల్ లోకి వచ్చిన వారు తొందరగా వెళ్లకుండా టైం ఎక్కడ ఏర్పాటు చేయరు. దీంతో సమయం తెలియకుండా అందులో అనుకోకుండా చాలా వరకు వస్తువులు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
హై ప్రైస్ ట్రిక్:
షాపింగ్ మాల్ లోకి వెళ్లినప్పుడు ర్యాక్ లో మనకు సరి సమానంగా ఎప్పుడూ ఖరీదైన వస్తువులనే ఉంచుతారు. తక్కువ ధర వస్తువులను కింద ఉంచుతారు. ఎందుకంటే కిందికి ప్రత్యేకంగా వంగి వస్తువులను ఎవరు చూడలేక పోతారు. ఈ ఖరీదైన వస్తువులు ఆకర్షణీయంగా ఉంటే ఒకసారి చూద్దాంలే అంటూ కొనుగోలు చేస్తారు.
బిల్ కౌంటర్ ట్రిక్:
షాపింగ్ పూర్తి అయిన తర్వాత మిల్ కౌంటర్ వద్దకు వచ్చేసరికి మరో ట్రిక్ ప్లే చేస్తారు. ఇక్కడ చాక్లెట్లు, తినే వస్తువులు ఎక్కువగా ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ క్యూలో ఉన్నంతసేపు వారి దృష్టి ఆ తినే వస్తువులపై పడి ఏదో ఒకటి కొనుగోలు చేసేలా ఉంటుంది. అలా అక్కడ కూడా కొన్ని వస్తువులు కొనుగోలు