Meesho low price reason: ఇప్పుడు జనాలు అంతా ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. దుస్తులనుంచి ఇంట్లో అవసరమైన వస్తువులతో పాటు టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ వంటి వస్తువులు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు. అయితే ఈ కామర్స్ సంస్థల మధ్య కూడా పోటీ పెరిగింది. మొన్నటివరకు Amazon, Flipkart వంటి సంస్థలు మాత్రమే ఉండేవి. కానీ ఈ రెండింటికి గట్టి పోటీ చేస్తూ meesho అనే సంస్థ వినియోగదారులకు అతి తక్కువ ధరలకే వస్తువులు అందిస్తోంది. ముఖ్యంగా దుస్తులు అయితే చాలా తక్కువ ధరకు ఇందులో లభిస్తున్నాయి. అసలు షాపులోకి వెళ్లి కొనుగోలు చేసే దుస్తులు కంటే ఆన్లైన్లో ఆమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో తక్కువ ధరకు లభిస్తాయి. కానీ వీటికి అంటే మరింత తక్కువగా meesho లో లభ్యమవుతున్నాయి. ఇంత తక్కువ ధరకు మీ షో ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు మీ షో ఏం చేస్తోంది?
ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎవరైనా డబ్బును ఎక్కువగా అర్జించాలని అనుకుంటారు. అయితే ఈ ఆలోచన ఉన్నవారు తొందరగా అభివృద్ధి చెందలేరు. వినియోగదారులకు మన్నిక గల వస్తువులను అందించాలని ఉద్దేశం ఉన్నవారు తొందరగా వారి మన్ననలు పొందుతారు. మొన్నటి వరకు ఎక్కడో ఉండే వస్తువులు ఆన్లైన్ ద్వారా కూర్చుని చోటే ఇంటికి తెప్పించుకునేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ వస్తువులు మరింత తక్కువ ధరకు వినియోగదారులకు అందేలా meesho మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టిస్తుంది. మీ షో తక్కువ ధరకు వస్తువులను ఇవ్వడానికి ప్రధాన కారణం జీరో కమిషన్ మెయింటైన్ చేయడమే. అంటే కమిషన్ తీసుకోకుండా వస్తువులను విక్రయించడం. ఇది ఎలా సాధ్యం? దీనివల్ల ఆ సంస్థకు ఎలాంటి లాభం?
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో వస్తువులు కంపెనీల వద్ద కొనుగోలు చేస్తారు. ఇలా చేసినప్పుడు వీరు కంపెనీలకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు రూ.100 ఉంటే అందులో రూ.20 ఈ కామర్స్ సంస్థలు కంపెనీకి కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ వస్తువు అసలు ధర రూ.80 అన్నమాట. అంటే కంపెనీకి ఈ కామర్స్ సంస్థలు ఇచ్చే కమిషన్ ను వినియోగదారులపై వేస్తారు. అయితే meeshoలో ఇలాంటి కమిషన్ ఉండదు. తక్కువ ధరకు ఎక్కడైతే వస్తువులు లభ్యమవుతాయో.. వాటిని మాత్రమే కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తారు. అంటే సాధారణ కంపెనీ నుంచి తక్కువ ధరకు ఉండే వస్తువులను మాత్రమే మీ షోలో విక్రయిస్తారు. ఉదాహరణకు meeshoలో విక్రయించే దుస్తులు సోలాపూర్ వంటి ప్రదేశంలో ఉత్పత్తి అయ్యే చిన్న పరిశ్రమల నుంచి తీసుకుంటారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో బ్రాండెడ్ కలిగిన వస్తువులు లభ్యమవుతాయి. అంటే సాంసంగ్, వివో వంటి ప్రముఖ కంపెనీలు ఈ సంస్థల ద్వారా తమ సేల్స్ ను పెంచుకుంటాయి. ఈ బ్రాండ్లు మార్కెటింగ్ కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తాయి. ఆ ఖర్చుల భారాన్ని వినియోగదారులపై వేస్తాయి.కానీ meeshoలో మాత్రం ఈ బ్రాండ్లు లభించవు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు వినియోగదారులకు పాస్ట్ డెలివరీ ఇవ్వడానికి ప్రముఖ కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటాయి. కానీ మీ సో మాత్రం డెలివరీ లేట్ అయిన తక్కువ జరిగే అందిస్తుంది. అందుకే మీ సో తొందరగా వినియోగదారుల ఆదరణ పొంది అభివృద్ధి చెందింది.