Biting nails: గందరగోళం, ఆందోళన, భయం వల్ల కొందరు గోర్లు కొరుకుతుంటారు. ఇలాంటి అలవాట్లు ఉంటే చాలు కాస్త ఒత్తిడి వచ్చినా చేతి గోర్లు నోట్లో పెట్టుకుని నమలడం, కొరకడం చేస్తుంటారు. నోట్లోనే సగం గోర్లు కూడా ఉండిపోతాయి. అంతేకాదు గోర్లు విరగడంతోపాటు అనేక సమస్యలు వస్తాయి. కొందరు ఎవరైనా మాట్లాడుతున్నా సరే తెగ గోర్లు కొరికేస్తుంటారు. నవ్వుతూ కూడా కొరుకుతుంటారు. అదొక అలవాటుగా మారిపోతుంది చాలా మందికి. కానీ ఈ అలవాటు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మీకు కూడా ఈ అలవాటు మానేసుకోండి. ఎందుకో ఓ సారి చూసేయండి.
ఆందోళన లేదా నెర్వస్‌నెస్ ఉన్నప్పుడు వాటిని తెలపలేక గోళ్లు కొరుకుతుంటారు. ఈ విధంగా గోళ్లు కొరుకుతూనే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే పలు రకాల శారీరక సమస్యలు వస్తాయి. మీకు గనుక ఈ అలవాటు ఉంటే వీలైనంత త్వరగా మానుకోవాలి. గోరు కొరకడం వల్ల శరీరంపై చెడు ప్రభావాలు పడతాయి. గోరు కొరకడం వల్ల గోళ్ల నిర్మాణం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఈ అలవాటు వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయి.
దంతాలు మాత్రమే కాదు నోట్లో చిగుళ్లు దెబ్బతింటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం పొడిబారడంతోపాటు పొరలుగా మారి ఊడిపోతుంది. ఇలా అవడం ఆరోగ్యకరం కాదు, ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇక ఈ గోరు కొరకడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. గోళ్లను నమలడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల కడుపు సమస్యలను వస్తాయి. గోళ్లలోని మురికి నోటిలో పేరుకుపోయి జలుబు, ఇతర అంటు వ్యాధులు వస్తాయి అంటున్నారు నిపుణులు. గోళ్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే సమస్య కూడా ఉందట. గోర్లు కొరికే అలవాటు ఉన్నవారికి పొట్ట, పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా వస్తుందట.
అయితే కొందరికి గోర్లు కొరికే అలవాటు వంశపారపర్యంగా వస్తుంది అనే చర్చ కూడా ఉంది. కానీ ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై కూడా పరిశోధనలు సాగుతున్నాయి. కొంతమంది నిపుణుల ప్రకారం పిల్లల తండ్రి, తల్లికి ఈ అలవాటు ఉంటే దాని ద్వారా పిల్లలకు కూడా గోర్లు కొరికే అలవాటు రావచ్చు అంటున్నారు నిపుణులు. అయితే దీనికి పర్టిక్యులర్‌గా ఓ టైమ్ అంటూ ఉండదు. ఏదైనా సందర్భంలో చేతి వేళ్ళు, గోర్లు నోటిలోకి వారికి తెలియకుండానే వెళ్తుంటాయి. నిజానికీ చాలా మందికి గోర్లు కొరుకుతున్నామని తెలియకుండానే కొరుకేస్తుంటారు కూడా. దీనిపై వారికి ఏమాత్రం అవగాహన ఉండకపోవడం వల్ల ఈ అలవాటు మరింత పెరుగుతుంది. మరొకరు చెప్పినప్పుడు మాత్రమే ఈ విషయం గమనిస్తుంటారు కూడా.
మరి దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? అయితే మీ గోర్లని ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరించుకోండి. నెయిల్ పాలిష్ ను కూడా రెగ్యులర్‌గా వేయండి. వీలైతే కొన్ని రోజులు గ్లౌజెస్ వేసుకొని ఉండండి. గోర్లు కొరకడం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుంటే మానసికంగా గోర్లు కొరకకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గోర్లు కొరికే సమయంలో మీరు వేరే పనిపై దృష్టిపెట్టండి. ఇలాంటి అలవాట్ల వల్ల మెల్లిమెల్లిగా గోర్లు కొరికే అలవాటుని దూరం చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..