Unwanted Hair : చాలామంది అమ్మాయిలకు ముఖంపై వెంట్రుకలు, మీసాలు రావడం ఎక్కువగా వస్తున్నాయి. అసలు అమ్మాయిలకు మీసాలు ఎందుకు వస్తాయి? వీటికి చికిత్స ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలా మీసాలు, గడ్డలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. దీంతో అమ్మాయిులు నలుగురిలో బయటకు వెళ్లడానికి ఇబ్బందిపడుతుంటారు. ఇలా చర్మంపై మగవారిలా ఎక్కువగా వెంట్రుకలు రావడాన్ని హిర్సుటిజం అంటారు. రెండు కారణాల వల్ల అమ్మాయిలకు ముఖంపై వెంట్రుకలు వస్తాయట. జన్యుపరమైన కారణాలు లేదా శరీరంలో హార్మోన్ డిజార్డర్ వల్ల మగవారిలా వెంట్రుకలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ సమస్య ఎక్కువగా పీసీఓడి, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుంది.
కొంతమంది మహిళల్లో మేల్ హార్మోన్ లెవల్స్ ఉంటాయి. సాధారణంగా ఇవి తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ కొన్నిసార్లు వీటి స్థాయి పెరగడం వల్ల మీసాలు, గడ్డాలు, ముఖంపై వెంట్రుకలు వస్తాయట. అలాగే పాలను ఉత్పత్తి చేసే హార్మోన్స్ ఎక్కువైనా, స్టీరాయిడ్స్ అధికంగా విడుదలయిన వెంట్రుకలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఆరోగ్య సమస్యలు లేదా చర్మం నిగారింపు కోసం వివిధ రకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి.
*శాశ్వతంగా వెంట్రుకలను తొలగించవచ్చు
ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా రావడం వల్ల అందంగా లేమని భావించి కొందరు అమ్మాయిలు షేవింగ్, థ్రెడింగ్ వంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మీ సమస్య తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. దీని తీవ్రతను ఫెర్రిమాన్-గాల్వే స్కోర్ ఆధారంగా డాక్టర్లు నిర్ధారిస్తారు. ఈ స్కోర్ 8 నుంచి 15 మధ్య ఉంటే సమస్య నార్మల్గా ఉన్నట్లే. ఆ స్కోర్ 15కంటే ఎక్కువగా ఉంటే పురుష హార్మోన్ల ప్రభావం ఎక్కువై సమస్య తీవ్రంగా ఉందని అర్థం. ఈ హార్మోన్లు ఎక్కువగా ఉండటానికి అసలు కారణాలు ఏంటో టెస్టోస్టెరోన్ పరీక్షతో తెలుసుకుంటారు. కొందరికి కాస్మొటిక్ చికిత్స చేస్తారు. మరికొందరికి ఎలెక్ట్రాలిసిస్ పద్ధతిలో శాశ్వతంగా జుట్టుని నిర్మూలిస్తారు. కానీ ఈ పద్ధతి చాలా నొప్పిని ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో లేజర్ చికిత్స కూడా చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రాలసిస్ కంటే తక్కువ నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పిని తట్టుకోలేం అనుకునేవాళ్లకి మందులతో చికిత్స చేస్తారు. దీనినే హార్మోస్ చికిత్స అని అంటారు.
Web Title: Why do girls get mustaches and unwanted hair
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com