IPL 2023 Mini Auction N Jagadeesan : ఐపీఎల్ వేలంలో ప్రధానంగా సన్ రైజర్స్ తరుఫున ముగ్గురే కనిపించారు. అందులో పెద్దగా అవగాహన లేని సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్, ఇక కొత్త కోచ్ బ్రియన్ లారా, శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ . ఈ ముగ్గురూ కలిసి ఎవరి కొంటున్నారో అర్థం కావడం లేదు. దిగ్గజ ఆల్ రౌండర్లను, ఆటగాళ్లను వదిలేసి అనాముకలపై కోట్లు కుమ్మరిస్తున్నారు. హెన్నీ బ్రూక్ పై 13 కోట్లు, మయాంక్ అగర్వాల్ పై 8 కోట్లు పోసి ప్రపంచ మేటి ఆటగాళ్లు అయిన బెన్ స్టోక్స్, సామ్ కరణ్ లాంటి వారిని వదిలేశారు. సన్ రైజర్స్ కొనుగోళ్లపై ఫ్యాన్స్ అంతా మండిపడుతున్నారు.

ఇక సూపర్ హాట్ ఫామ్ లో ఉన్న జగదీశన్ ను కూడా ఆక్షన్ లో తక్కువ ధరకు వచ్చినా సన్ రైజర్స్ కొనకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల విజయ్ హాజరే ట్రోపీలో బ్యాక్ టు బ్యాక్ ఐదు వరుస సెంచరీలు చేసి దేశం దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీలోనూ తమిళనాడు జట్టు ఓపెనర్ గా 77 బాల్స్ లోనే హైదరాబాద్ పై సెంచరీ బాదాడు.
ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో ముఖ్యాంశాల్లో ఉన్న డాషింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఎన్ జగదీశన్‌ను ఐపీఎల్ 2023 కోసం 90 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఇతడి బేస్ రేట్ కేవలం 20 లక్షలే కావడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) , కోల్ కతా మధ్య జగదీశన్ కోసం పెద్ద వేలం జరిగింది. అయితే నిధుల కొరత కారణంగా సీఎస్కే జగదీశన్ కోసం వెనక్కి తగ్గింది. సన్ రైజర్స్ వద్ద 20 కోట్లు ఉన్నా కూడా దేశవాళీలో ఇరగదీస్తున్న ఇతంటి అమూల్యమైన ఆటగాడిని కొనుగోలు చేయలేదు. వేలం కొనుగోళ్లలో సన్ రైజర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందనడానికి ఇదొక ఉదాహరణ.
ఎన్ జగదీశన్ 2022 ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఆడాడు. అతను 2 మ్యాచ్‌ల్లో 40 పరుగులు చేశాడు. అయితే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అయిన జగదీషన్ ను టీంలో ఎంఎస్ ధోని ఉండడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఓ సారి వచ్చాడు. 2020లో 4 సార్లు ఐపీఎల్ విజేత సీఎస్కే తరపున అరంగేట్రం చేసిన జగదీసన్ ఐపీఎల్ లో ఇది 4వ సంవత్సరం.
బ్యాటర్ ప్రత్యేకత ఏమిటంటే.. అతను బౌలర్‌ని స్థిరపడనివ్వడు. ధాటిగా ఆడుతాడు. ఇలాంటి ఫాంలో ఉన్న ఆటగాడిని వదిలేసి సన్ రైజర్స్ మూల్యం చెల్లించుకుంది. కేకేఆర్ అందిపుచ్చుకుంది. కేకేఆర్ గత సీజన్‌లో 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచినందున ఇలాంటి ఆటగాడి కోసం చూస్తోంది.