Elon Musk- Vijaya Gadde: ఆంధ్రా ! అందులోనూ బెజవాడ. ఆమె హవా మామూలుగా లేదు. ట్విటర్ లో పొలిటికల్ యాడ్స్ ఆపడం మొదలు, డొనాల్డ్ ట్రంప్ లాంటోళ్ల అక్కౌంట్లు లేపడం వరకూ ఆమె బ్రాండ్ చాలా పాపులర్. ఎస్. ఆమె విజయ గద్దె. ట్విటర్ లీగల్ డిపార్టుమెంటు హెడ్.

అభ్యంతరకర ట్వీట్లు తీసేసే గైడ్ లైన్స్ మొదలు… లీగల్, ప్రైవసీ లాంటి ప్రతీ ఇష్యూనీ ఆమె తనదైన స్టైల్లో డీల్ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్ లో అయితే ఆమె ఇన్ ఫ్లూయెన్స్ గురించి ప్రపంచం చాలా మాట్లాడుకుంది. ట్రంప్ అక్కౌంట్ ఎగిరింది అప్పుడే ! ఎగిరెగిరి రెచ్చిపోయిన కంగన లాంటి వాళ్లెందరో విజయ ఎఫెక్ట్ తో కంగుతిన్నారు.
ప్రతీ కథకీ ఓ మలుపు ఉన్నట్టే విజయ కథ కూడా ! మస్క్ టేకోవర్ మొదలు కాగానే గురిపెట్టి పడగొట్టిన వికెట్స్ లో విజయ ఒకరు. ఎందుకంటే ఆమె ట్విటర్ ని మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ డిసిప్లిన్డ్ చేసేసింది మరి ! మామూలుగానే ట్విటర్ ఇన్ ఫ్లూయెన్సర్స్ అండ్ తెలివైన వాళ్లుండే ప్లాట్ ఫామ్ ! అందుకే కొద్దిమందే ఉన్నా కేక పొలిమేర వరకూ వినపడుతుంది. అందుకే మస్క్ కన్నేశాడు. కొనేశాడు. ఇక వాడేస్తాడు. ఆర్టిఫియల్ బ్రెయిన్స్ తయారు చేసి డబ్బున్న తెలివి తక్కువోళ్లతో బిజినెస్ చేయాలన్న ప్లాన్ తో పాటు, ఇంకెన్నో కంత్రి ఖతర్నాక్ రంబోలా ఉన్నోడాయె ! మరి తెలివి, డిసిప్లిన్ రెండూ ఉంటే ఎందుకు ఒప్పుకుంటాడు ? అందుకే విజయ వీడ్కోలు.

గద్దె విజయది చిన్నప్పుడు బెజవాడ. టెక్సస్ లో సెటిలైంది కుటుంబం. కార్నెల్ వర్సిటీలో లేబర్ లా చదివారామె. పదేళ్లు సిలికాన్ వేలీలో వేరియస్ ఉద్యోగాల తర్వాత పదేళ్ల కిందట ట్విటర్ లోకి వచ్చి అప్పట్లో సీఈవో జాక్ డోర్సీకి కుడి భుజంలా మారారు. పరాగ్ కోసం కూడా పని చేశారు. ఇదిగో ఇప్పుడిలా ! ఏదేమైనా బెజవాడోళ్లు మామూలోళ్లు కాదు.