Nagababu- Assets: మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆయన వారసులు ఎంతో మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో ఆయన మొదటి తమ్ముడు నాగేంద్రబాబు ఒకరు. చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ సినిమాతో తెరంగేట్రం చేసిన నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు అన్నయ్యతో పాటు పలు సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత ‘కౌరవుడు’ తదితర సినిమాల్లో హీరోగా వచ్చి ఆకట్టుకున్నాడు. నాగబాబు సినీ యాక్టర్ గానే కాకుండా ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ‘జనసేన’కు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఆయన ఆస్తుల చిట్టా చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

నటుడిగానే కాకుండా నాగబాబు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఎక్కువగా మెగాస్టార్ సినిమాలను నిర్మించి డబ్బు బాగానే సంపాదించాడు. అయితే కొన్ని సినిమాల తరువాత నాగబాబుకు నష్టాలు మొదలయ్యాయి. ఈ నష్టాలను భరించలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి ఆదుకున్నాడని అంటారు. అయితే ఆ తరువాత టీవీ షో జబర్దస్త్ లో జడ్జిగా చేరిన తరువాత నాగబాబు దశ తిరిగింది. ఈ షో సక్సెస్ కావడంతో ఆయనకు పారితోషికం బాగానే ముట్టింది. ఎన్నికల సందర్భంగా నాగబాబు తన ఆస్తుల చిట్టాను బయట పెట్టడంతో ఎంత సంపాదించారన్న విషయం బయటపడింది.
నాగేంద్రబాబు ఆస్తులు మొత్తం రూ.41 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో వాహనాలు, చరాస్తులు 36.73 కోట్లు కాగా.. స్థిరాస్తులు 4.22 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 2.70 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆస్తులు నికరంగా రూ.38 కోట్లు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. కొన్ని రోజులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నా.. ఆ తరువాత డబ్బును బాగానే కూడబెట్టినట్లు తెలుస్తోంది.

కొన్ని సినిమాలకు నిర్మాతగా ఆయనకు డబ్బు వచ్చినా.. ఆ తరువాత సక్సెస్ కాలేకపోయారు. దీంతో భారీగా నష్టం వచ్చింది. చిరంజీవి నటించిన మృగరాజు సినిమా సమయంలో కోలుకోలేని దెబ్బతగిలినట్లు చెప్పుకుంటారు. ఈ క్రమంలో ఆయన సూసైడ్ అటెమ్ట్ చేశారు. కానీ ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ నాగబాబును ఆదుకున్నారు. ప్రస్తుతం నాగబాబు టీవీ షో లతో బిజీ లైఫ్ ను గడుపుతూ బాగానే సంపాదిస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ ‘జనసేన’ కోసం పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కూడా స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే.