https://oktelugu.com/

Niharika Konidela: పెళ్లికూతురుగా నిహారిక కొణిదెల… తెరపైకి కొత్త అనుమానాలు, వైరల్ లుక్!

చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వెంకట చైతన్యతో నిహారిక బంధం సవ్యంగా సాగలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 25, 2024 / 01:04 PM IST

    Niharika Konidela bride look goes viral

    Follow us on

    Niharika Konidela: నిహారిక కొణిదెల ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటిగా, నిర్మాతగా రాణించాలని అడుగులు వేస్తుంది. ఇటీవల ఓ తమిళ మూవీ కి సైన్ చేసింది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాకుండా ఓటీటీలో చెఫ్ మంత్ర పేరుతో వంటల ప్రోగ్రాం కి యాంకర్ గా మారింది. ఈ మెగా డాటర్ కెరీర్ పరంగా బిజీగా మారుతుంది. హీరోయిన్ గా నిహారిక ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించింది.

    కానీ ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఆమె కెరీర్ లో ఒక్క హిట్ కూడా పడలేదు. అనంతరం చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వెంకట చైతన్యతో నిహారిక బంధం సవ్యంగా సాగలేదు. పెళ్ళైన మూడేళ్లకు నిహారిక-వెంకట చైతన్య మనస్పర్థలతో విడిపోయారు. పెళ్ళైన తర్వాత యాక్టింగ్ కు దూరమైన నిహారిక, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది.

    కాగా నిహారిక లేటెస్ట్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. సదరు వీడియోలో నిహారిక ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంది. పట్టు చీర కట్టుకుని, నగలు, పువ్వులు పెట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబైంది. సాంప్రదాయ కట్టులో చాలా అందంగా కనిపిస్తుంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిహారిక పెళ్లి కూతురిగా మారిన నేపథ్యంలో ఆమె రెండో వివాహం ఏమైనా చేసుకుంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఆమెకు రెండో పెళ్లి పై ఆసక్తి ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

    పిల్లలు అంటే నాకు ఇష్టం. కనుక రెండో వివాహం ఖచ్చితంగా చేసుకుంటాను. ఎప్పుడు అనేది చెప్పలేను అన్నారు. మరోవైపు పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పలు వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘ వాట్ ద ఫిష్ ‘ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. తన పూర్తి ఫోకస్ కెరీర్ పై పెట్టింది. మరి నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి…