Homeలైఫ్ స్టైల్Roadside Tree Painting : రోడ్డు పక్కన చెట్లకు తెల్లగా ఎందుకు పెయింట్ వేస్తారు? కారణం...

Roadside Tree Painting : రోడ్డు పక్కన చెట్లకు తెల్లగా ఎందుకు పెయింట్ వేస్తారు? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Roadside Tree Painting : మనిషికి చెట్టుకు అవినాభావ సంబంధం ఉంది. చెట్లు లేకుండా మానవాళి మనుగడ సాధ్యం కాదు. చెట్లు మనకు ప్రాణవాయువును అందజేస్తాయి. చెట్లు లేకపోతే కరువు తాండవిస్తుంది. పూర్వం లాగా అడవులు లేవు. ప్రస్తుతం అంతా కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. అందుకే అవకాశం ఉన్న చోటల్లా చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే రోడ్లు వెంబడి చెట్లు నాటుతుంటారు. సాధారణంగా మనం ఎక్కడి కైనా ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎత్తైన చెట్లు ఉండడాన్ని చూసే ఉంటాం. వాటిని ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? ఈ చెట్లకు ఎల్లప్పుడూ దిగువ భాగంలో అంటే కాండం మీద తెల్లని రంగులో పెయింట్ చేసి ఉంటుంది. ఈ చెట్లకు ఒకే రకమైన పెయింట్ అంటే తెలుపు రంగు ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

రోడ్డు పక్కన ఒక గ్రీన్ బెల్ట్ తయారు చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం పచ్చదనాన్ని ప్రోత్సహించడం. అంతేకాకుండా, ఈ గ్రీన్ బెల్ట్ ప్రమాదాలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇప్పుడు వాటికి తెల్లని రంగు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. తెలుపు రంగు పెయింట్ ప్రధానంగా మొక్కలను రక్షించడానికి ఉపయోగిస్తారు. సున్నం సాధారణంగా రోడ్డు పక్కన చెట్ల(Road Side Trees) కు పెయింట్ చేసేందుకు ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చెట్టుకు సున్నం పూస్తే చెట్టు బెరడులలో పగుళ్లు ఏర్పడదు. ఇది చెట్టు కాండాన్ని బలపరుస్తుంది. సున్నంతో పెయింట్ చేసినప్పుడు మూలానికి చేరుకుంటుంది.

సున్నం కారణంగా కీటకాలు చెట్టు వేర్లపై దాడి చేయలేవు. ముఖ్యంగా చెదపురుగులు చెట్టు చెంతకు రావు. ఇది మొక్క జీవిత కాలాన్ని(Life Span) బాగా పెంచుతుంది. చెట్టు బయటి పొరకు రక్షణను అందిస్తుంది. కార్నెల్ యూనివర్సిటీ విధ్యార్థుల పరిశోధకుల ప్రకారం చెట్టుకు తెల్లటి పెయింట్ చేయడం వల్ల నేరుగా సూర్యకాంతి వల్ల చెట్టు దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది. దాని తెలుపు పెయింట్ కారణంగా చెట్టు ట్రంక్‌కు తక్కువ నష్టం ఏర్పడుతుంది. చెట్టుకు తెల్లగా రంగు వేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. రోడ్డుపక్కన నాటిన చెట్లకు తెలుపు రంగు ఉండడంతో ఈ చెట్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయన్న సంకేతాన్ని సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులెవరూ ఈ చెట్లను నరకడానికి అనుమతి ఉండదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version