Seven Days: వారానికి ఏడు రోజులు ఎందుకు ఉన్నాయి.. ఇలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?

Seven Days: సాధారణంగా నెలకు ముప్పై రోజులు వారానికి 7 రోజులు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి. ఎనిమిది లేదా తొమ్మిది రోజులు ఉండొచ్చు కదా. లేకపోతే వారానికి ఆరు రోజులే ఉండొచ్చు కదా… 7 రోజులు ఎందుకు ఉన్నాయి. ఇలా వారానికి 7 రోజులు ఉండటాన్ని ఎవరు కనుగొన్నారు?వారానికి 7 రోజులు ఉండటానికి గల కారణం ఏమైనా ఉందా? అనే విషయం గురించి చాలామంది ఆలోచించకపోవచ్చు. అయితే […]

Written By: Kusuma Aggunna, Updated On : January 7, 2022 6:57 pm
Follow us on

Seven Days: సాధారణంగా నెలకు ముప్పై రోజులు వారానికి 7 రోజులు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి. ఎనిమిది లేదా తొమ్మిది రోజులు ఉండొచ్చు కదా. లేకపోతే వారానికి ఆరు రోజులే ఉండొచ్చు కదా… 7 రోజులు ఎందుకు ఉన్నాయి. ఇలా వారానికి 7 రోజులు ఉండటాన్ని ఎవరు కనుగొన్నారు?వారానికి 7 రోజులు ఉండటానికి గల కారణం ఏమైనా ఉందా? అనే విషయం గురించి చాలామంది ఆలోచించకపోవచ్చు. అయితే వారానికి 7 రోజులు ఎందుకు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం….

వారానికి 7 రోజులు ఉండాలనే నియమాన్ని బాబిలోన్ ప్రజలు కనుగొన్నారు. ఖగోళంలో ఉండే గ్రహాలు సూర్యచంద్రులు కదలిక ఆధారంగా కనుగొన్నారు. ఇలా గ్రహాల కదలికల కాన్సెప్ట్ ఆధారంగా వారానికి 7 రోజులు అనే విషయాన్ని కనుగొన్నారు. ఖగోళంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, బుదుడు, గురుడు, శుక్రుడు వంటి గృహాల కదలికలు ఆధారంగా చంద్రుని 28 రోజుల కక్ష్య ఆధారంగా వారానికి 7 రోజులు అనే విషయాన్ని గుర్తించారు.

ఇలా వారానికి 7 రోజులు అనే విషయాన్ని గుర్తించిన సమయంలోనే ఈజిప్టు రోమ్ వంటి ప్రాంతాలలో వారానికి ఎనిమిది పది రోజులు ఉండేవి. ఆ సమయంలో అలెగ్జాండర్ అక్కడ కూడా ఇదే సంస్కృతిని ఆచరణలో పెట్టడం వల్ల వారానికి ఏడు రోజులుగా పాటిస్తున్నారు. ఈ వారంలో ఆరు రోజులు పని దినాలుగా బావించి ఒకరోజు మతపరమైన ప్రార్థనల కోసం సెలవు దినంగా ప్రకటించారు. ఇలా అప్పటి నుంచి వారంలో ఆరు రోజులు పని రోజుల్లో 1 ఈ రోజు సెలవు దినంగా పాటించారు. అనంతరం ఇదే సంస్కృతిని చైనా దేశం వారు కూడా పాటిస్తూ వచ్చారు. ఇలా గ్రహాల కదలికల ఆధారంగా వారానికి ఏడు రోజులు వచ్చాయి.