Extramarital Affairs: మానవ సంబంధాలు గతి తప్పుతున్నాయి. శృతి మించుతున్నాయి. దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతోంది. ఫలితంగా జీవిత భాగస్వాములకు సమస్యలు ఎదురవుతున్నాయి. కాపురాల్లో అన్యోన్యత తగ్గడానికి మనమే కారణమా? ఎందుకు అంతరాలు పెరుగుతున్నాయి. ఆలుమగల మధ్య ఎందుకు ఇంత దూరం అవుతోంది? అనురాగాలు ఎందుకు తగ్గుతున్నాయి. ఆప్యాయతలు ఎలా మాయమవుతున్నాయి అనే వాటిపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో శృంగార వాంఛ తగ్గడంతో జీవిత భాగస్వామి పక్కదారి పడుతున్నట్లు చెబుతున్నారు. దంపతుల మధ్య చోటుచేసుకునే కారణాలే కాపురాలు కూలడానికి కారణమవుతున్నాయి.

ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల మధ్య శృంగార కోరికలు అంతరిస్తున్నాయి. ఫలితంగా వారు పక్కదారి పడుతున్నారు. వివాహేతర సంబంధాలతో కాపురాన్ని కకావికలం చేసుకుంటున్నారు. దీంతో ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కాపురాలు కలకాలం నిలవాలంటే వారి మధ్య నమ్మకమనే పునాది ఉండాలి. అది లేని నాడు సంసారం నిలబడటం కష్టమే. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి. ఒకసారి నమ్మకం కోల్పోతే ఇక అంతే సంగతి.
ఇప్పుడు రోజులు కూడా అలాగే మారాయి. ఎవరు కూడా పెళ్లినాటి ప్రమాణాలు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడి శృంగారానికి మొగ్గు చూపుతున్నారు. వివాహేతర సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా కాపురాలు నిలబడటం లేదు. దంపతులు విడాకులు తీసుకునే వరకు వెళ్తున్నారు. పాశ్చాత్యులు మన సంస్కృతిని ఇష్టపడుతుంటే మనం వారి బాటలో పయనిస్తున్నాం. చాలా మంది జంటలు విడాకులు తీసుకునేందుకు వెనకాడటం లేదు. దీంతో కుటుంబ సంబంధాలు కాస్త దూరం అవుతున్నాయి.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తోంది. చిన్న విషయాలను కూడా పెద్దగా తీసుకోవడంతో సమస్యలు వస్తున్నాయి. దంపతుల్లో అర్థం చేసుకునే ధోరణి పట్టు తప్పుతోంది. దీంతో జంటలు విడిపోవడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఇక వివాహేతర సంబంధాలైతే ఈ రోజుల్లో పెరిగిపోతున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న భార్యను కడతేర్చడం, ప్రియురాలు కోసం ఆమె భర్తను హతమార్చడం వంటి చర్యలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కారణాలతోనే రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

వివాహేతర సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి? దంపతుల్లో అనురాగాలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. వయసులో తేడాలు ఉంటే కూడా వీటిని ఆశ్రయిస్తున్నారు. జీవిత భాగస్వామి దగ్గర సుఖం లేకపోతే పక్కదార్లు పడుతున్నారు. జీవిత భాగస్వామి చేసే చేష్టల వల్ల కూడా కోపంతో ఇంకొకరిని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దంపతుల్లో వస్తున్న అనుమానాలతో కూడా వీటి బాట పడుతున్నారు. ఇలా వివాహేతర సంబంధాల విషయంలో ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. మన వివాహ వ్యవస్థకు చెడుపేరు తీసుకురాకుండా ఉండాలంటే దంపతుల్లో సఖ్యత పెరగాలి. ప్రేమ చిగురించాలి. అప్పుడే ఇతర మార్గాల వైపు దృష్టి నిలపరు.