https://oktelugu.com/

Parents: కొడుకు, కూతురు.. తల్లిదండ్రులకు ఎవరిపై ప్రేమ ఎక్కువ ఉంటుంది?

కూతురు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు ఆమె మీద కూడా ప్రేమ ఉంటుంది. కాస్త పెరిగితే అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ.. నాన్నకు సేవలు చేస్తుంటుంది కూతురు. నాన్న అన్నం తిను, టీ తాగు, అక్కడికి వెళ్లకు నాన్న ఇక్కడికి వెళ్లకు నాన్న త్వరగా ఇంటికి రా నాన్న అంటూ తన ప్రేమను తెలియజేస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 12, 2024 3:21 pm
    Parents

    Parents

    Follow us on

    Parents: తల్లిదండ్రులకు తమ బిడ్డలంటే ప్రాణం. పిల్లలకు తల్లిదండ్రి అంటే ప్రాణం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు. పిల్లలు ఎలాంటి వారు అయినా సరే వారిని ప్రేమిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే కొందరు ఆడపిల్లలు మాత్రం మా అన్నను/తమ్ముడు ను ఇష్టపడతారు మా తల్లిదండ్రులు నన్ను కాదు అని అంటారు. కొందరు మొగపిల్లలు మా అక్కను/చెల్లెను ఇష్టపడతారు నన్ను కాదంటారు. ఇంతకీ తల్లిదండ్రులకు కొడుకుపై ప్రేమ ఉంటుందా? కూతురు మీద ఉంటుందా? తెలిస్తే మీరు కామెంట్ చేయండి..

    కూతురు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు ఆమె మీద కూడా ప్రేమ ఉంటుంది. కాస్త పెరిగితే అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ.. నాన్నకు సేవలు చేస్తుంటుంది కూతురు. నాన్న అన్నం తిను, టీ తాగు, అక్కడికి వెళ్లకు నాన్న ఇక్కడికి వెళ్లకు నాన్న త్వరగా ఇంటికి రా నాన్న అంటూ తన ప్రేమను తెలియజేస్తుంది. మంచి చెడులు తెలుసుకుంటూ ఇద్దరికి తోడు ఉంటుంది కూతురు. ఎంతో ప్రేమగా చూసుకునే కూతురు ఎప్పుడైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే అని తెలిసి తల్లిదండ్రి ఎంతో బాధ పడతారు. ఇలా కూతురు మీద ప్రేమ ఉంటుంది.

    కొడుకు పుట్టి పెరుగుతుంటే.. తన వంశం అభివృద్ధి చెందుతుంది అని తల్లిదండ్రి మురిసిపోతుంటారు. కాస్త పెరిగితే కొడుకు కూడా నాన్నకు తోడుగా పొలం పనుల దగ్గర నుంచి అన్ని పనులు చూసుకుంటాడు. ఇక వ్యాపార రంగంలో వ్యాపారం లేదా చిన్న చిన్న పనులు ఇంటిని బట్టి తన సహాయం ఉంటుంది. ఇలా కుమారుడు తండ్రికి తోడు అవుతుంటే తల్లి మురిసిపోతుంది. నా కొడుకు ఉండగా నాకు టెన్షన్ ఎందుకు అని నాన్న అనుకుంటాడు. ఇలా కుమారుడు అంటే కూడా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది.

    అయితే కొడుకుది ఒక రకమైన ప్రేమ, కూతురుది మరొక రకమైన ప్రేమ.. సో వారిపై తల్లిదండ్రులకు కూడా ఒకరకమైన ప్రేమ ఉంటుంది. ఇలా వీరందరిది కూడా స్వచ్ఛమైన ప్రేమనే.. నన్ను చెత్తబుట్టలో నుంచి ఎత్తుకొచ్చారు అని కూతురు గానీ కొడుకు గానీ అనాల్సిన అవసరం లేదు. కూతురు మీద కొడుకు మీద ఇద్దరి మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. అది సమయాన్ని బట్టి తెలియజేస్తారు. సో బీ హ్యాపీ విత్ పేరెంట్స్.