Health Tips : తెల్లజుట్టుతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే..

వయసుతో సంబంధం లేకుండా చిన్న వారిలో సైతం తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది అని అంటున్నా.. శరీరంలో

Written By: Chai Muchhata, Updated On : February 5, 2024 2:06 pm

White hair problems

Follow us on

Health Tips :వాతావరణ కాలుష్యంతో పాటు నాణ్యత లోపించిన ఆహారంతో చాలా మంది నేటి కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటి పరిష్కారానికి మెడిసిన్ వాడుతున్నా నయం కావడం లేదు. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని హెల్త్ టిప్స్ పాటించడం వల్ల కొన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎదుర్కొనే సమస్య తెల్ల జుట్టు రావడం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వారిలో సైతం తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది అని అంటున్నా.. శరీరంలో సరైన పోషకాలు లేకపోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్య రాకుండా ఉంటుందని అంటున్నారు. మరి తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఏయే పదార్థాలు తీసుకోవాలి?

శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతే జుట్టు రావడం ఆగిపోతుంది. కొందరిలో జుట్టు వచ్చినా ఇది తెల్లగా ఉంటుంది. అలాగే వరుసగా ఒత్తిడి ఎదుర్కోవడంతో పాటు విటమిన్ల లోపం తోనూ ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో బి 12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఇ, జింక్, కాపర్ ఐరన్ వంటిని శరీరానికి అవసరం. సమయం లేకపోవడంతో పాటు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల తెల్ల జుట్టు వస్తుంది. అయితే తెల్లజుట్టు రాకుండా ఎలాంటి పదార్థాలు తీసుకోవాలంటే?

పోషకాలు మెండుగా ఉన్న ఆహార పదార్థం బాయిల్డ్ ఎగ్. ఇందులో కాల్షియం విపరీతంగా ఉంటుంది. ప్రతిరోజూ ఏదో రకంగా కోడిగుడ్డును తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. భోజనంలో కొందరు పెరుగు తప్పనిసరి చేసుకుంటారు. మరికొందరు మాత్రం పెరుగు అంటే దూరంగా ఉంటారు. కానీ పెరుగులో విలమిన్ బి 12 అధికంగా ఉంటుంది. ఇది మెలనిన్ వర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. దీంతో తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది.

నల్ల నువ్వులను కేవలం పూజకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఈ నువ్వులు కలిపిన చిక్కీ, నువ్వుల లడ్డు ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి. నువ్వుల్లో కాల్షియంతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సీ విటమిన్ ఉసిరి కాయలో అధికంగా లభిస్తుంది. ఉసిరిని పచ్చడి లేదా జ్యూస్ ద్వారా తీసుకుంటే నల్ల జుట్టు సమస్య నుంచి బయటపడుతారు. ఎండు ద్రాక్షలను తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు జుట్టుకు ఎక్కువగా రసాయనాలు కలిగిన షాంపులను వాడకుండా చూసుకోవాలి. అలాగే కొబ్బరి నూనెలో చిటికెడు ఉసిరిపొడిని వేసి గోరువెచ్చగా చేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తరువాత జుట్టుకు పట్టించాలి. ఆ తరువాత స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెల్ల జుట్టు సమస్య ఉండదు.