Black with this plant oil: ఈ మొక్క నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.. వెంటనే తెలుసుకోండి..

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా ఉపయోగపడుతాయి. అయితే చాలా మంది వీటిని పట్టించుకోకుండా రసాయనాలు వాడుతున్నారు. ప్రకృతి సహజంగా లభించే వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి

Written By: Srinivas, Updated On : October 23, 2024 5:30 pm

black with this plant oil

Follow us on

Black with this plant oil: కాలం మారుతున్న కొద్దీ మనుషులు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. శరీరం లోపలే కాకుండా చర్మసంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. సరైన ఆహారం, వాతావరణ కాలుష్యంతో పాటు కలుషిత నీటి వల్ల కొందరికి జుట్టు సమస్యలు కూడా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడడం.. కొందరికి 30 ఏళ్లు కూడా రాకముందే ఊడిపోవడం..మరికొందరికి పలచబడడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి కొందరు రకరకాల క్రిములు, రసాయనాలు వాడుతున్నారు. కానీ వీటి వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదు. అయితే కొన్ని ప్రయోగాల వల్ల.. ఎలాంటి రసాయనాలు లేకుండా ఈ మొక్కకు సంబంధించిన నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇంతకీ ఆ మొక్క ఏదంటే?

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా ఉపయోగపడుతాయి. అయితే చాలా మంది వీటిని పట్టించుకోకుండా రసాయనాలు వాడుతున్నారు. ప్రకృతి సహజంగా లభించే వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. అలాంటి ఔషధాలు ఇచ్చే మొక్కలో బృంగరాజ్ మొక్క ఒకటి. దీనినే గంటగలక అని కూడా పిలుస్తారు. ఈ మొక్కతో నూనెను తయారు చేసుకొని జుట్టుకు రాయడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దీని వల్ల ఉండే ఉపయోగలేంటంటే?

ఆయుర్వేద శాస్త్రంలో బృంగరాజ్ మొక్క గురించి చెప్పారు. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కలో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. బృంగరాజ్ మొక్కతో నూనెను తయారు చేసి మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఇది జట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది.

గుంటగలక మొక్కలో ఉండే ఔషధాల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది కాంతివంతంగా మారుతుంది. ఎలాంటి తెల్ల జుట్టు లేకుండా నల్లగా నిగనిగలాడుతాయి. దీనిని తలకు అంటించనప్పుడు జుట్టు మెరుస్తుంది. చుండ్రు సమస్య ఉన్నవారు దీనిని రాసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ తో పాటు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీంతో తలలో ఉన్న ఎటువంటి ఇన్ఫెక్షన్లను అయినా తగ్గించి తలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం కాలంలో తెల్లజుట్టుతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటి వారు ఈ మొక్కతో చేసిన నూనెను తలకు అంటించాలి. ప్రతిరోజూ ఈ ఆయిల్ తోను అంటించడం వల్ల ఇప్పటి వరకు ఉన్న తెల్లజుట్టు నల్లగా మారే అవకాశం ఉంది.

జుట్టు సమస్య మాత్రమే కాకుండా చాలా మంది తలనొప్పి సమస్య ఉంటుంది. దీని పరిష్కారానికి ఈ ఆయిల్ మంచి ఔషధంలా ఉంటుంది. క్రమం తప్పకుండా దీనిని రాసుకోవడం వల్ల హాయిగా ఉండగలుగుతారు. అలాగే తలనొప్పి మాయం కావడంతో మంచి నిద్ర కూడా ఉంటుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. ప్రతిరోజూ తలకు నూనె అంటించిన తరువాత10 నిమిషాల పాటు అలాగే ఉండాలి. దీంతో హార్మోన్లు సమతుల్యత కూడా ఉంటుంది.