IPL 2022: ఐపీఎల్ పండుగకు వేళయింది. వైభవంగా నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. దీంతో కొండంత పండుగకు సమాయత్తం అవుతోంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఆటలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోళ్లలో కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. తమ పలుకుబడి ఉపయోగించి ఎక్కువ డబ్బు పెట్టి మరీ ఆటగాళ్లను తమ జట్టుకు సొంతం చేసుకున్నాయి. దీంతో ఆటలపై అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికి తేడా కనిపించింది. కొందరు ఆటగాళ్లు బాగా రేటు పలుకుతారనుకుంటే తక్కువ ధరకే అమ్ముడుపోవడం విశేషం. తక్కువ ధరకు అమ్ముడుపోతారనుకున్న కొందరు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముడవడం తెలిసిందే. దీంతో మ్యాచుల నిర్వహణపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు. పది జట్లు ఉండటంతో ఏ జట్లు ఎంత మేర విజయాలు సాధిస్తుందో అని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఫ్రాంచైజీలు కూడా ఈసారి భిన్నంగా వ్యవహరించాయి. స్టార్ ఆటగాళ్లకు తక్కువ ధర కొత్త వారికి ఎక్కువ ధర చెల్లించడం తెలిసిందే. దీంతో ఈసారి ఆటగాళ్ల ప్రదర్శనపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. విదేశీ ఆటగాళ్ల కంటే స్వదేశీ వారినే ఎక్కువగా కొనుగోలు చేసి తమ పట్టుదలను ప్రదర్శించాయి. దీంతో ఆటగాళ్ల తీరుపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది.
Also Read: యూపీలో బీజేపీకి ఓటేయని వారి ఇళ్లను బుల్ డోజర్లతో తొక్కిస్తాం: రాజాసింగ్ హెచ్చరిక
ఇందులో హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం అందరికంటే ప్రత్యేకత చూపించింది. ఎలాంటి టాలెంట్ లేని వారిని ఎంచుకుని పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. తక్కువ ధరకే ఆటగాళ్లను కొనుగోలు చేసి తన జట్టును కూర్చుకున్నా వారు ఎంత మేర ప్రభావం చూపుతారో తెలియడం లేదు. దీంతో జట్టు విజయం సాధిస్తుందా అనే అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి. ఏదిఏమైనా ఐపీఎల్ నిర్వహణలో ఏ జట్లు ప్రభావం ఎక్కువగా చూపుతుందో వేచి చూడాల్సిందే.
హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగుళూరు చాలెంజర్స్, కోల్ కత నైట్ రైజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై జట్లున్నా ఏ జట్లు ఎంత మేర గెలుపు బాటలో దూసుకుపోతోందో తెలియడం లేదు. దీంతో అబిమానుల్లో కూడా రోజురోజుకు అంచనాలు పెరుగున్నాయి.
Also Read: ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ యేనా? ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు?