Vastu Directions: మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. సరైన తిండి, నిద్ర లేని మనిషి రోగగ్రస్తుడు. అందుకే సమయానికి తిండి, నిద్ర రెండు అవసరమే. అవి కరువైన నాడు మనకు అనారోగ్యం వచ్చినట్లే. అందుకే వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రతి మనిషి తన జీవితంలో ఎక్కువ సమయం నిద్రకే కేటాయిస్తాడు. రాత్రి ఉన్నది పడుకోవడానికే. ప్రస్తుత కాలంలో ప్రకృతివిరుద్ధంగా రాత్రి చేయాల్సిన పనులు చేస్తూ పగలు చేయాల్సిన పనులు రాత్రి చేస్తూ తమ ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. అయినా లెక్కచేయడం లేదు. మనకు వాస్తు శాస్త్రం ప్రకారం మనం సరైన దిశలో నిద్రించకపోతే నిద్ర కూడా మనకు సరిగా పట్టదనే విషయం గ్రహించుకోవాలి.

ఇటీవల కాలంలో ప్రతిదాన్ని వాస్తు కోణంలోనే చూస్తున్నాం. పక్కా వాస్తు ఉంటేనే ఏదైనా చేస్తున్నాం. లేదంటే వదిలేస్తున్నాం. మనం సరైన దిశలో పడుకోకపోతే కూడా మనకు నిద్ర కరువే అవుతుంది. నిద్ర లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. నిద్ర లేకపోతే ఏ పని చేయలేం. శరీరమంతా అలసటగా ఉంటుంది. కళ్లు మూతలు పడతాయి. నిద్ర లేకపోతే తిండి కూడా సరిగా తినలేం. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నిద్రను కూడా ఒక భాగంగానే చూసుకుని దానికి తగిన సమయం ఉండేలా చూసుకోవాలి.
Also Read: Chikoti Praveen case – TRS Leaders: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ కన్ను
వాస్తు ప్రకారం మనం నిద్రించే గది ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా పడక గది నైరుతిలోనే ఉండేలా చూసుకోవాలి. బెడ్ మీద మనం తల దక్షిణం వైపు పెట్టుకుని ఉత్తరం వైపు కాళ్లు ఉండేలా చూసుకుంటే మంచిది. బాగా నిద్ర పడుతుంది. అలా వీలు కాకపోతే పడమర వైపు తల పెట్టుకుని తూర్పు వైపు కాళ్లు పెట్టుకుని నిద్రించేలా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. అంతేకాని వ్యతిరేక దిశలో అంటే పడమర వైపు కాళ్లు తూర్పు వైపు తల పెట్టి నిద్రించకూడదు. అది ప్రకృతికే విరుద్ధం. అందుకే మనం నిద్రించే పడగ గది కోసం జాగ్రత్తలు పాటించాల్సిందే మరి.

ఇక పడుకునే ముందు కాళ్లు శుభ్రం చేసుకుంటే మంచిది. మన పూర్వీకులు చెప్పారు. భోజనం చేసే ముందు, పడుకునే ముందు కాళ్లు కడుక్కుంటే మరింత ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం ఉంది. ఇలా ఎన్నో విషయాలు మనకు మన వారు చెప్పడం జరిగింది. వాటన్నింటిని పాటించి జీవితంలో ఎదిగేందుకు దోహదపడే అవకాశాలను మెరుగుపరచుకోవాలి. సంధ్యాకాలం వేళ తినడం, పడుకోవడం చేయరాదు. అలా చేస్తే కూడా అరిష్టమే. వాస్తు శాస్త్రం ప్రకారం మనకు ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని మన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవాలి.
