Sweet Lime Benefits: మనకు ప్రకృతి ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, తినే ఆహార పదార్థాలను ఇచ్చింది. కానీ మనం వాటిని తినడం లేదు. కృత్రిమమైన వాటి కోసం పరుగులు పెడుతున్నాం. ఉచితంగా దొరికినవి కాకుండా డబ్బులు పెట్టే వాటి కోసమైతే అర్రులు చాస్తున్నాం. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రకృతిసిద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా ఆస్పత్రుల్లో వేలకు వేలు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నాం. ఏమంటే నా విధి రాత ఇంతే అని సరిపెట్టుకుంటున్నాం. మనకు దొరికే తాజా పండ్లు, కూరగాయలు అలాగే తింటే ఏ రకమైన ఇబ్బందులు రావు. కానీ మనం మందుతో కూడినవి తింటూ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నాం.

మనకు దొరికే పండ్లలో ప్రధానమైనవి బత్తాయి. చూడ్డానికి ఆకుపచ్చ రంగులో అందంగా ఆకర్షణీయంగా ఉండే ఈ పండులో ఎంతో విలువైన పోషకాలు ఉన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఈ సీజన్ లో విరివిగా లభించే బత్తాయిలో భలే ప్రొటీన్లు ఉన్నాయి. మినరల్స్ కూడా దాగి ఉన్నాయి. దీంతో దీన్ని తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటమే కాదు మనకు ఎన్నో రకాల మేలు కలిగిస్తుంది. అందుకు బత్తాయిని బాగా తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి.
Also Read: Chikoti Praveen case – TRS Leaders: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ కన్ను
బత్తాయిలో విటమిన్ సి, ఏలతోపాటు కాల్షియం, కార్బొహైడ్రేడ్లు, పాస్పరస్, పొటాషియం, పోలేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ట్యూమర్, యాంటీ డయాబెటిక్, యాంటీ అల్సర్ వంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఆహారంలో బత్తాయిని చేర్చుకోవాలి. బత్తాయిలో ఉండే లిమోనాయిడ్స్ క్యాన్సర్ రాకుండా తోడ్పడతాయి. బత్తాయిలో క్యాన్సర్ నిరోధక కారకాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రోజు బత్తాయిని తీసుకుని మన ఆరోగ్యాన్ని పదిలం చేసుకునేందుకు మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

బత్తాయితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్లేవనాయిడ్స్ ఉండటంతో అవి జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. దీంతో యాసిడ్స్, బైల్ రసాలను పెంచి జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సహాయ పడుతుంది. బత్తాయితో ఇంకా అనేక లాభాలున్నాయి. మలబద్దకాన్ని పోగొడుతుంది. జీర్ణక్రియ బాగా జరగడంతో మలబద్దకం సమస్య అనేది రాదు. బత్తాయి రసం తొందరగా రక్తంలో కలిసిపోతోంది. దీంతో మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. బత్తాయితో మన శరీరం భలే తేజ్ గా మారుతుందని తెలుసుకోవాలి.
ఇది అధిక కొవ్వును కూడా కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ కు మంచి మందుగా పనిచేస్తుంది. బాగా లావుగా ఉన్న వారు తరచుగా బత్తాయి తీసుకుంటే మంచి ప్రయోజనమే. అధిక కొవ్వును తగ్గించే గుణం బత్తాయిలో ఉంది. అందుకే విరివిగా తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రోజు బత్తాయి జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. బత్తాయిని తీసుకోవడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు కూడా దూరమవుతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతో మేలు చేస్తాయని తెలుసుకుని బత్తాయిని రోజు వాడుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.
Also Read:KCR Declares New Pensions: 10 లక్షల పాచిక ముందస్తు కేనా
