Onion Benefits: మూడు రంగుల్లోని ఉల్లిపాయల్లో ఏది ఆరోగ్యానికి మంచిదంటే?

ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుదలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : January 20, 2024 6:56 pm

Onion Benefits

Follow us on

Onion Benefits: ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అని సామెత ఉంది. ఎందుకంటే ఉల్లిని తరుగుతుంటే ఆటోమేటిక్ గా కన్నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ అమినోయాసిడ్ ను ఉత్పత్తి చేసే భాస్వరం ఉంటుంది. భాస్వరం మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాంథియాల్సో అనే యాక్సైడ్ ద్రవం వస్తుంది. ఎంత కన్నీళ్లు వచ్చినా ఉల్లి పాయ లేని కూర ఉండదు. ఉల్లి వేయడంలో కూర ఎంతో రుచిగా మారుతుంది. సాధారణంగా ఉల్లిపాయ అనగానే తెల్లగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎరుపు రంగులో కనిపిస్తుంది. కానీ గోధుమ కలర్ లో కూడా ఉల్లిపాయ ఉంటుంది. మరి ఈ మూడు రంగుల్లో ఉన్న ఉల్లిపాయలో ఏది బెటర్? దేంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుదలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు తగ్గించేందుకు ఉల్లి సహకరిస్తుంది. దీనిని తరుచుగా తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. దంత సంబంధిత క్రిములను ఉల్లి నాశనం చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్, రాగి, ఫైబర్ తో పాటు విటమిన్ బి, సిలు సమృద్ధిగా ఉంటాయి.

ఉల్లిపాయలు మూడు రకాలుగా కనిపిస్తాయి. మొదటిది తెల్ల ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. పైన తెల్లగా ఉండి, కట్ చేసిన కొద్దీ లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, పోషకాలు ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా కూరతో పాటు సల్సాలు, డిప్స్ కోసం ఉపయోగిస్తారు. రెండోది ఎర్ర ఉల్లిపాయ. దీనిని సాధారణ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పైన రెడ్ కలర్లో ఉండి కట్ చేసిన కొద్ది ఉదా రంగులో ఉంటుంది. దీనిని శాండ్విచ్, బర్గర్ లో ఉపయోగిస్తారు.

మూడో రకమైన ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది మిగతా వాటికంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది రుచి ఎక్కువగా ఉండడంతో పాటు ఎముకల సాంద్రతకు ఉపయోగంగా ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో సహాయపడుతాయి. అయితే దీనిని సూప్ లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణ మార్కెట్లో ఇది తక్కువగా కనిపిస్తుంది.