Budget Planning: ఒక వస్తువును చూడగానే దానిని కొనాలని అనిపిస్తుంది. అది తినేది అయితే దాని రుచిని చూసి అనుభూతి పొందాలని అనిపిస్తుంది. ఒకవేళ డ్రెస్ అయితే దానిని ధరించి అందరిలో మంచి లుక్ ఉండాలని అనిపిస్తుంది. ఇలా పలు అవసరాలకు డబ్బును ఖర్చు చేయడం వల్ల కొన్ని రకాల లాభాలు ఉండవచ్చు. అంతేకాకుండా సౌకర్యాలను తీర్చుకోవడం వల్ల మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. మరి ఇదే సమయంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన కూడా ఉంటుంది. ఒక పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అని ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. ఇలాంటి సమయంలో సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడం మంచిదా? పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత లాభాలు పొందడం మంచిదా? దీనిని అర్థం చేసుకోవడానికి ఈ స్టోరీ చదవండి..
ఒక అమ్మాయి ఉద్యోగం చేసి.. రూ.10,000 ఆదాయం పొందింది. అయితే కొత్త ఉద్యోగం కనుక ఈ డబ్బులతో ఏవైనా సౌకర్యాలు తీర్చుకోవాలని అనుకుంది. అమ్మాయిలకు ఎక్కువగా డ్రెస్ కొనుక్కోవడం ఇష్టం. దీంతో ఆ డ్రెస్ కోసం షాప్ వద్దకు వెళ్ళింది. అయితే షాప్ ముందుకు రాగానే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బుతో డ్రెస్ కొనుగోలు చేస్తే.. నలుగురిలో ఆకర్షణీయంగా ఉండగలుగుతాం. కొంతమంది స్నేహితులు గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాటి వల్ల ఏం లాభం? అని ఆలోచించింది. అయితే ఇదే సమయంలో ఈ డబ్బుతో ఏదైనా పెట్టుబడులు పెడితే లాభం వస్తుంది కదా? అని ఆలోచించి ఆ డబ్బుతో ఒక బంగారు ఉంగరంను కొనుగోలు చేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఉంగరం వ్యాల్యూ లక్ష రూపాయలకు మారింది. దీంతో అప్పుడు ఆ అమ్మాయి అనుకుంది డ్రెస్ కొనుగోలు చేస్తే కొన్ని రోజు వరకు మాత్రమే ఉంటుంది. అదే ఏదైనా పెట్టుబడి పెడితే ఆ తర్వాత లాభాలు వస్తాయి అని అనుకుంది.
అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు.. డ్రెస్ కూడా అవసరమే కదా అని అనుకోవచ్చు. అవును. కానీ రూ.10,000 పెట్టి డ్రెస్ కొనుగోలు చేయడం కంటే అందులో కొంత భాగం డ్రెస్ కొనుగోలు చేసి మిగతాది అయినా పెట్టుబడులు పెట్టాలి. అంటే ప్రతి వ్యక్తిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన వస్తే ఎప్పటికైనా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది అన్నదే ఈ స్టోరీ నీతి. అలాగే చాలామంది నేటి కాలంలో వృధా ఖర్చులు ఎన్నో చేస్తున్నారు. ఆ డబ్బుతో పెట్టుబడులు పెడితే ఆ తర్వాత ఎన్నో రకాలుగా లాభాలు వచ్చి ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. ఈరోజుల్లో ఉద్యోగం, వ్యాపారం ద్వారా ఆదాయం కొంతమందికి తక్కువగానే వస్తుందని భావించేవారు.. ఇలా చిన్నచిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది.