https://oktelugu.com/

Bindi: మీరు బొట్టు ఎక్కడ పెట్టుకుంటున్నారు?

బొట్టు కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా పెట్టుకోవాలి అంటారు నిపుణులు. దీని వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 29, 2024 / 02:02 PM IST

    Where are you putting the bindi

    Follow us on

    Bindi: ఆడవారు ఎంత అలంకరించుకున్న కూడా బొట్టు పెట్టుకోకపోతే అందంగా కనిపించరు. ఎన్ని వేల చీర కట్టుకున్నా బొట్టు అమ్మాయికి అందాన్ని ఇస్తుంది. అంతేకాదు కాస్త కుంకుమ పెట్టుకుంటే ఎలాంటి అమ్మాయి అయినా సరే ఆకర్షిస్తుంది. బొట్టు అంటేనే అమ్మాకి అందం. మరి ఈ బొట్టు పెట్టుకునే స్థానం కూడా చాలా ప్రధానమే. ఇంతకీ బొట్టు ఎక్కడ పెట్టుకోవాలి. దాని వల్ల లాభం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    బొట్టు కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా పెట్టుకోవాలి అంటారు నిపుణులు. దీని వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుందట. ఇంట్లో గొడవలు కూడా జరగవట.వ్యాధులు రావట. ఇంట్లో ఉండే కష్టాలు తొలిగిపోతాయట. ఆపదలు, చాడి మాటలు కూడా దూరం అవుతాయట. అంటే అబ్బాయిలు బొట్టు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంటారు. అయితే బొట్టు లంబిక స్థానంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అంటారు నిపుణులు.

    వేడి పోవాలంటే ఐబ్రోలకు కాస్త పైకి బొట్టు పెట్టుకోవాలి. దీని వల్ల శరీరంలో ఉన్న వేడి మొత్తం పోయి చల్లగా ఉంటుందట. ఉష్ణాన్ని తీసేస్తుందట ఈ బ్రహ్మ స్థలంలోని బొట్టు. కానీ ఈ కాలంలో బొట్టు పెట్టుకునే వారి సంఖ్య చాలా తక్కువగా మారింది. మహిళలు కూడా చాలా చిన్న చిన్న స్టికర్లు/ బొట్టు పిల్లలు పెట్టుకుంటున్నారు. కొందరు ఈ చిన్న చిన్న బొట్టు పిల్లలను కూడా పెట్టుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల స్టైల్ అనుకుంటున్నారు కానీ సంప్రదాయాలను తదుపరి తరాలకు నేర్పించడం లేదని తెలుసుకోలేకపోతున్నారు.

    బొట్టు పెట్టుకుంటే తలరాత మారుతుందట. మరి ఇంత గొప్ప ప్రాధాన్యత ఉన్న బొట్టు పెట్టుకోవడం అందం, ఆరోగ్యం కాబట్టి మీరు ఈ సంప్రదాయాన్ని మానకుండా, మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఇలా బొట్టు పెట్టుకోవడమే కాదు మనం రోజు అనుకోకుండా చేసే చాలా చిన్న చిన్న పనులు కూడా ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటివి మరికొన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు అయితే మీ నుదుటికి బొట్టు లేకపోతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ గుడ్ లైఫ్.