https://oktelugu.com/

Kollywood: కోలీవుడ్ కి ఫస్ట్ 100 కోట్ల మూవీ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? త్రిష, నయనతార, అనుష్క కాదు! ఇంట్రెస్టింగ్ స్టోరీ!

ఒకప్పుడు సౌత్ ఇండియాను డామినేట్ చేసిన కోలీవుడ్ కి కూడా 100 కోట్ల చిత్రం ఇవ్వడానికి దశాబ్దాలు పట్టింది. 2007లో అది సాకారం అయ్యింది. త్రిష, నయనతార, అనుష్క శెట్టిలకు సాధ్యం కాని ఈ ఫీట్ మరొక హీరోయిన్ సాధించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 29, 2024 / 01:50 PM IST

    Heroine who gave the first 100 crore movie to Kollywood

    Follow us on

    Kollywood: పరిశ్రమ ఏదైనా సక్సెస్ ని నంబర్స్ డిసైడ్ చేస్తాయి. బాక్సాఫీస్ హిట్స్, కలెక్షన్స్ లెక్కలే స్టార్స్ గా నిలబెడతాయి. వసూళ్ల ఆధారంగానే ఓ సినిమా సక్సెస్ రేంజ్ ని నిర్ణయిస్తారు. మార్కెట్ ని బట్టే ఒక హీరో లేదా హీరోయిన్ రెమ్యూనరేషన్, స్టార్డం ఏమిటో తెలుస్తుంది. కాగా 100 కోట్ల వసూళ్లు అనేది ప్రతి చిత్ర పరిశ్రమకు బెంచ్ మార్క్. సినిమా యూనివర్సల్ కావడంతో ఈ మధ్య భాషా బేధాలు తొలగిపోయాయి. 100 కోట్ల వసూళ్లు చాలా తేలిక అయిపోయింది. కానీ గతంలో బడా స్టార్స్ కి కూడా ఈ వంద కోట్ల మార్క్ సాధ్యం కాని వ్యవహారం.

    ఒకప్పుడు సౌత్ ఇండియాను డామినేట్ చేసిన కోలీవుడ్ కి కూడా 100 కోట్ల చిత్రం ఇవ్వడానికి దశాబ్దాలు పట్టింది. 2007లో అది సాకారం అయ్యింది. త్రిష, నయనతార, అనుష్క శెట్టిలకు సాధ్యం కాని ఈ ఫీట్ మరొక హీరోయిన్ సాధించింది. ఆమె ఎవరో కాదు శ్రియా శరన్. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ కోలీవుడ్ ఫస్ట్ రూ. 100 కోట్ల వసూళ్లను అధిగమించిన తొలి చిత్రం.

    శివాజీ మూవీ వరల్డ్ వైడ్ రూ. 125 నుండి 160 కోట్ల వసూళ్లను సాధించింది అబ్బురపరిచింది. శివాజీ బ్రేక్ చేసిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. నటుడు సుమన్ ఈ చిత్రంలో విలన్ గా మారాడు. సుమన్-రజినీకాంత్ కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలెట్. శివాజీ సినిమా నాటికి శ్రియా శరన్ కెరీర్ పీక్స్ లో ఉంది. త్రిష, నయనతార, అనుష్క శెట్టి స్టార్స్ గా సౌత్ ని ఏలుతున్నారు. ఈ ముగ్గురు నుంచి శ్రియా శరన్ కి గట్టి పోటీ ఎదురయ్యేది. నయనతార, అనుష్క శెట్టి కంటే శ్రియా సీనియర్ అని చెప్పాలి.

    రజినీకాంత్ పక్కన నటించే అవకాశం శ్రియాను వరించింది. రజినీకాంత్-శ్రియా కాంబోలో వచ్చిన మొదటి చిత్రం శివాజీ కావడం విశేషం. శంకర్ మార్క్ సోషల్ సబ్జెక్టు తో కూడిన కమర్షియల్ మూవీ శివాజీ. వ్యవస్థల్లో ఉన్న అవినీతి మీద ఓ ఎన్నారై చేసిన పోరాటాన్ని శివాజీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. శ్రియా మనసు గెలుచుకునేందుకు రజినీకాంత్ పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతం అని చెప్పాలి.

    ‘పువ్వల్లే నవ్వుల్’ సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియుల నోళ్ళలో నానుతుంది. చిత్ర విజయంలో శ్రియా శరన్ తన వంతు పాత్ర పోషించింది. ఆమె ఇన్నోసెంట్ యాక్టింగ్, సాంగ్స్ లో మైమరిపించే గ్లామర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. శివాజీ మూవీ సక్సెస్ శ్రియా శరన్ కి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. 2001లో నా ఇష్టం మూవీతో శ్రియా కెరీర్ మొదలు కాగా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. సీనియర్ హీరోల పక్కన ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ ని శ్రియ శరన్ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానం.