After retirement : ప్రస్తుత జీవనశైలిలో అందరూ బిజీ బిజీగా ఉంటున్నారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణ కోసం ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలని ఎన్నో ఇబ్బందులు పడతారు. ఉద్యోగాలు చేసి అలిసిపోయి.. రిటైర్‌మెంట్ తర్వాత హాయిగా ఉండాలని ముందే ప్లాన్ చేసుకుంటుంటారు. రిటైర్‌మెంట్ తర్వాత ఎక్కడో ఒక దగ్గర సంతోషంగా సేదతీరాలని భావిస్తారు. దీనికి కోసం ముందు నుంచే ఓ ప్రణాళికతో ఉంటారు. రిటైర్‌మెంట్ తర్వాత ఎక్కడ ప్లేస్ కొనాలి? ఏ ప్రదేశంలో సెటిల్ అయితే హ్యాపీగా ఉంటుంది? ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు సెట్ అయ్యే ప్లేస్ ఏదని తెగ ఆలోచిస్తుంటారు. మరి రిటైర్‌మెంట్ తర్వాత హ్యాపీగా సేదతీరే ప్లేస్‌లు ఏవో ఈరోజ తెలుసుకుందాం.
రిటైర్‌మెంట్ తర్వాత హ్యాపీగా జీవించే ప్రదేశాల్లో మొదటిది గోవా. ఎందుకంటే గోవాలో సేదతీరడానికి మంచి ప్లేస్‌లు ఉన్నాయి. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందమైన ప్రకృతి, చల్లని సముద్రాలు, టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి. రిటైర్‌మెంట్ తర్వాత హ్యాపీగా ఉండటానికి గోవా బెస్ట్ ప్లేస్ అని ఒకరకంగా చెప్పవచ్చు.
గోవా తర్వాత స్థానంలో సెటిల్ అవ్వడానికి కేరళ బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేరళలో ఉండే పచ్చని సౌందర్యం, ఆ ప్రకృతి, ఇంటి చుట్టూ ఉండే పచ్చని పొలాలు, వాటర్ ఫాల్స్, అడవులు ఇలా ఎన్నో రకాల అందమైన ప్లేస్‌లు ఉన్నాయి. గాడ్స్ ఓన్స్ కంట్రీగా పేరొందిన కేరళలో రిటైర్‌మెంట్ తర్వాత హాయిగా సేద తీరవచ్చు. నార్మల్‌గా వెకేషన్‌కి వెళ్తేనే.. అక్కడి నుంచి రావాలనిపించదు. ఎందుకంటే చూడటానికి రెండు కళ్లు, జీవితం సరిపోదు. కాబట్టి రిటైర్‌మెంట్ తర్వాత అక్కడ ఉంటే ఫ్రీగా అన్ని ప్రదేశాలు చూడవచ్చు.
కర్ణాటకలో ఉన్న మైసూర్ చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ ఉండే రాజభవనాలు, మైసూర్ ప్యాలెస్, ఉద్యానవనాలు రమణీయంగా ఉంటాయి. ఇక్కడి వాతావరణం కూడా చాలా హాయిగా ఉంటుంది. రిటైర్‌మెంట్ తర్వాత మైసూర్‌లో సెటిల్ అయితే మీరు హ్యాపీగా ఉండవచ్చు.
కోయంబత్తూరులో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్లేస్ వీక్షించడానికి చూడముచ్చటిగా ఉంటుంది. అక్కడ ఉండే వాతావరణం, ఎంతో అందమైన దేవాలయాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. సీజనల్‌గా ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. రిటైర్‌మెంట్ తర్వాత ఇక్కడ సెటిల్ కావచ్చు.
వీటి తర్వాత ఆప్షనల్‌గా పూణె, డెహ్రడూన్, పుదుచ్చేరి, మేఘాలయ, ఉత్తరాఖండ్‌లో సెటిల్ అవ్వచ్చు. ఈ ప్రదేశాల్లో ఎంతో చక్కని వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆహ్లాదరకం వాతావరణం ఎలాంటి వాళ్లకైన ఈజీగా నచ్చుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్తే.. ఇక అస్సలు రావాలని కూడా అనిపించదు. అయితే సీజనల్‌గా కొన్నిసార్లు ఇక్కడి వాతావరణం అందరికీ సెట్ కాకపోవచ్చు. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రిటైర్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు రిటైర్‌మెంట్ తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా సేదతీరవచ్చు.