Valentine’s Day : వాలెంటైన్స్ వీక్ వచ్చే వారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి జంటకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. చాలా సార్లు వారు ప్రపోజ్ చేయడానికి ఒక నిర్దిష్ట ప్రదేశం కోసం సెర్చ్ చేస్తుంటారు. మీ బడ్జెట్ సరిగ్గా ఉంటే, మీరు విదేశాలకు వెళ్లి మీ ప్రేమను తెలియజేయాలనుకుంటే, ఈ స్టోరీ మీకోసమే. అయితే ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోని అత్యంత సూపర్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ జంటలు తమ ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఇక్కడికి వెళ్లడం వల్ల ప్రేమికులు, దంపతులు కూడా ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఇక ఈ వాలెంటైన్స్ వీక్ కేవలం గులాబీలు ఇవ్వడం, చాక్లెట్లు తినడం లేదా రొమాంటిక్ డేట్‌లకు మాత్రమే పరిమితం కాదు. మీరు ఈసారి మీ భాగస్వామితో కొత్తగా, గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకుంటే, రొమాంటిక్ ట్రిప్‌ని ప్లాన్ చేయడం చాలా మంచి ఆలోచన, కానీ ప్రతిసారీ సిమ్లా, మనాలి, గోవా లేదా ఉదయ్‌పూర్‌లకు వెళ్లే బదులు, వేరే ఏదైనా ఎందుకు ప్రయత్నించకూడదు? భారతదేశంలో చాలా అందమైన, అన్వేషించని గమ్యస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మీరు మీ భాగస్వామితో విశ్రాంతిగా, గుర్తుండిపోయే రోజులను కూడా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఎక్కడికి వెళ్లాలంటే?
పారిస్, ఫ్రాన్స్
పారిస్ అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని ప్రేమ నగరం అని పిలుస్తారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జంటలు వాలెంటైన్స్ వీక్ జరుపుకోవచ్చు. ఇక్కడ ఐఫెల్ టవర్ అత్యంత సూపర్ ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ సీన్ నదిలో క్రూయిజ్ రైడ్‌ను కూడా ఆస్వాదించవచ్చు.
వెనిస్, ఇటలీ
ఇటలీలోని వెనిస్ నగరం ప్రపంచవ్యాప్తంగా అందానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా సినిమాలు చిత్రీకరించారు. వెనిస్ నీటి మధ్యలో ఉన్న నగరం. ఇక్కడ జంటలు గ్రాండ్ కెనాల్‌లో గొండోలా రైడ్‌ని ఆనందించవచ్చు. అంతేకాకుండా, శాన్ మార్కో స్క్వేర్‌లో జంటలు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు.
ఇస్తాంబుల్, టర్కీ
ఇస్తాంబుల్ కూడా ప్రముఖులకు ఇష్టమైన ప్రదేశం. ఇక్కడికి కేవలం భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తారు. మీరు వాలెంటైన్స్ వీక్ జరుపుకోవాలనుకుంటే, ఈ ప్రదేశం ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ జంటలు బోస్ఫరస్ డిన్నర్ క్రూజ్, కమాలికా హిల్, పియరీ లోటి హిల్‌లకు వెళ్లవచ్చు.
స్విట్జర్లాండ్
మంచు లోయలను ఎవరు ఇష్టపడరు చెప్పండి. అందరికీ ఇష్టమే. ప్రేమికుల వారంలో జంటలు స్విట్జర్లాండ్‌ను కూడా సందర్శించవచ్చు. మీరు చల్లని గాలి, అందమైన లోయలను ఇష్టపడితే, స్విట్జర్లాండ్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ Titlis, Jungfrau లో మంచు సాహసాన్ని ఆనందించవచ్చు. ఇక్కడ వాలెంటైన్స్ వీక్‌ని జరుపుకునే వినోదం మీరు ఎప్పుడు మర్చిపోలేరు కూడా.