Whatsapp New Feature: వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక నెంబర్ సేవ్ చేయకుండానే…

తాజాగా వాట్సాప్ నుంచి కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండానే ఫైల్స్ పంపించుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ అధికారికంగా ప్రకటించలేదు. కానీ వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్ వచ్చిందా? లేదా? అనేది చెక్ చేసుకోవచ్చు. దీనికి యూజర్స్ వాట్సాప్ ను ఓపెన్ చేసి స్మార్ట్ న్యూ చాట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఏనెంబర్ కు మెసేజ్ చేయాలనుకుంటున్నారో.. ఆ ఫోన్ నెంబర్ ను సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఆ తరువాత మెసేజ్ చేసేలా ఎనేబుల్ ఆప్షన్ వస్తుంది. ఆ తరువాత మీరు అనుకున్న ఫైల్స్ పంపించేయచ్చు.

Written By: Srinivas, Updated On : July 19, 2023 1:48 pm

Whatsapp New Feature

Follow us on

Whatsapp New Feature: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో మెసేజ్ పంపించుకోవడం తో పాటు ఫైల్స్ కూడా క్షణాల్లో పంపించుకునే వీలుంది. మెటా సంస్థ వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు ఎవరికైనా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలంటే వారి కాంటాక్టును తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా కేవలం నెంబర్ ద్వారానే మెసేజ్ పంపించే సదుపాయాన్ని కల్పించింది. దీని వివరాలేంటంటే.?

కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తన్న మెటా సంస్థ వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. సాధారణ మెసేజ్ నుంచి భారీ ఫైల్స్ వరకు వాట్సాప్ ద్వారా పంపించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా వాట్సాప్ ద్వారా ఈజీగా కాంటాక్టు కావొచ్చు. మెసేజ్, ఫైల్స్ పంపించుకోవడమే కాకుండా వీడియో కాల్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక కొన్ని సంవత్సరాల కిందట వాట్సాప్ మనీ సెండింగ్ యాప్ గా కూడా అలరిస్తోంది.

తాజాగా వాట్సాప్ నుంచి కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండానే ఫైల్స్ పంపించుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ అధికారికంగా ప్రకటించలేదు. కానీ వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్ వచ్చిందా? లేదా? అనేది చెక్ చేసుకోవచ్చు. దీనికి యూజర్స్ వాట్సాప్ ను ఓపెన్ చేసి స్మార్ట్ న్యూ చాట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఏనెంబర్ కు మెసేజ్ చేయాలనుకుంటున్నారో.. ఆ ఫోన్ నెంబర్ ను సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఆ తరువాత మెసేజ్ చేసేలా ఎనేబుల్ ఆప్షన్ వస్తుంది. ఆ తరువాత మీరు అనుకున్న ఫైల్స్ పంపించేయచ్చు.

వాట్సాప్ పు అప్డేట్ చేసిన తరువాత ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు కాస్త శ్రమ తగ్గించినట్లవుతుంది. ఇప్పటి వరకు కొత్తవారిరి ఏదైనా ఫైల్స్ పంపించాలంటే వారి కాంటాక్ట్ ను సేవ్ చేసుకోవాల్సి ఉండేంది. దీంతో పోన్ స్టోరేజీ హెవీ అయ్యేది. ఇప్పుడు ఆ సమస్య ఉండదని అంటున్నారు. అయితే మెటా సంస్థ అధికారికంగా ప్రకటించిన తరువాతే ఇది అందుబాటులోకి వస్తుందా? లేక ముందే వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.