https://oktelugu.com/

Devara Collections : దేవర’ 2వ రోజు వసూళ్లు.. రాయలసీమలో బీభత్సం.. కానీ ఆ ప్రాంతాలలో దారుణంగా పడిపోయిన కలెక్షన్స్!

చూస్తుంటే నేడు ఈ చిత్రానికి ఈ ప్రాంతం నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట. చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా ఇలాంటి వసూళ్లు రాకపోవడం గమనించాల్సిన విషయం.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2024 / 08:16 PM IST

    Devara Hindi Advance Bookings

    Follow us on

    Devara Collections : ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ షోస్ గడిచే కొద్ది టాక్ బాగా మెరుగుపడింది, ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 140 నుండి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం 172 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు పోస్టర్ ని విడుదల చేసారు. ఇది ప్రతీ పెద్ద సినిమాకు జరిగేదే, ప్రమోషన్స్ కోసం చేసే ప్రక్రియ లో ఒకటి, దానిని ఎవరూ తప్పుబట్టలేరు కానీ, రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ ఈ చిత్రానికి కనిపించింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న ముందస్తు సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయట. రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి నేడు మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి.

    చూస్తుంటే నేడు ఈ చిత్రానికి ఈ ప్రాంతం నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట. చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా ఇలాంటి వసూళ్లు రాకపోవడం గమనించాల్సిన విషయం. ఇక నైజాం ప్రాంతం లో రెండవ రోజు హైదరాబాద్ సిటీ లో మంచి ఆక్యుపెన్సీ దక్కినప్పటికీ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం యావరేజ్ రేంజ్ వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మార్నింగ్ షోస్, మ్యాట్నీ షోస్ బాగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ చిత్రానికి మార్నింగ్ మరియు మ్యాట్నీ షోస్ కి కలిపి కేవలం 30 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చింది. ఉత్తరాంధ్ర లో కూడా అదే పరిస్థితి. వైజాగ్ సిటీ మ్యాట్నీస్ నుండి కోలుకున్నాయి కానీ, మిగిలిన ప్రాంతాలలో బాగా దెబ్బ పడింది.

    కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గత చిత్రాలు ‘బ్రో ది అవతార్’, ‘వకీల్ సాబ్’ లకు దగ్గరగా కూడా లేకపోవడం గమనార్హం. నెల్లూరు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను మాత్రమే రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. సాయంత్రం షోస్ నుండి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నందున రెండవ రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం 15 నుండి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఎంత రాబట్టబోతుందో, ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ నుండి 2.8 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టగా, మొదటి రోజు 1 మిలియన్ లోపే గ్రాస్ వసూళ్లు వచ్చాయి.