Mango Pickle: మనదేశంలో ఊరగాయకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మనం తీసుకునే ఆహారంలో ఊరగాయ ప్రధాన భూమిక పోషిస్తుంది. దీంతో తలుగువారికి ఊరగాయ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఊరగాయ తినడం మనకు ఓ అలవాటుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊరగాయను నోరూరించే విధంగా ఇళ్లల్లో తయారు చేసుకుంటారు. ఏడాదంతా ఊరగాయ తింటూ ఆస్వాదిస్తారు. అది ఆహారంలో తీసుకుంటేనే పరిపూర్ణం అవుతుంది. లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంది.

ఊరగాయ ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పప్పు చేసినా, ఏ కూర వండినా చివరకు ఆవకాయ తీసుకోవాల్సిందే. ఆహారంలో ఊరగాయ ఉంటేనే మనసు కుదుటపడుతుంది. లేదంటే ఓదో లోటు కనిపిస్తుంది. అందుకే మన ఆహారంలో ఊరగాయ ఉంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తెలుగు వారి ఇళ్లల్లో ఊరగాయ ఉంచుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడతారు. దాన్ని తయారు చేసేందుకు కూడా ఎంత శ్రమ అయినా భరించి వాటిని పెడుతుంటారు.
Also Read: The economic situation of Telangana : కేసీఆర్ కు ఈనెల గడిస్తే అదే చాలబ్బా!
ఊరగాయతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో వాడే అధిక నూనె, ఉప్పు వల్ల మన ఆరోగ్యం దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. అందుకేు ఊరగాయను మితంగానే తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కానీ కొందరైతే మొత్తం ఆహారాన్ని ఊరగాయతోనే తినేందుకు ఇష్టపడుతుంటారు అలాంటి వారికి ప్రమాదకరమే. అందుకే ఏదో ఒక్క వక్క వేసుకుని లాగేయాల్సి ఉంటుందని తెలిసినా పట్టించుకోవడం లేదు.

ఊరగాయ వాడే పురుషుల్లో సంతానోత్పత్తి ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. ఊరగాయను సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కానీ ఇష్టారాజ్యంగా పెద్ద మొత్తంలో తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని తెలిసిందే. మన ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఊరగాయను చూస్తే ఊరుకునే వీలు కాదు కానీ జిహ్వ చాపల్యం చంపుకోవాల్సిందే. ఊరగాయను ఎక్కువగా తీసుకోకుండా కొంచెంగా తీసుకుని ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుస్తోంది. దీంతో ఊరగాయ ప్రియులు కాస్త జాగ్రత్త. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Also Read:Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం