Nepal flight crash : నేపాల్ విమాన ప్రమాదం.. ఆ ఎత్తైన కొండల్లో టేకాఫ్ సమస్యలు.. అసలేమిటీ డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’..?

ఎత్తయిన ప్రదేశాల్లో ఉండే రన్‌వేలను ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అంటారు. ఈ రన్‌వేలు చుట్టూ ఉన్న భూ భాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి ఒకవైపు లేదంటే రెండు వైపులా లోయ ఉంటుంది. కొన్ని మీటర్ల ఎత్తు నుంచి చూస్తే రన్‌ వే, పక్కనున్న భూభాగం సమాంతరంగా ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. ఇక్కడ టేకాఫ్‌, ల్యాండింగ్‌ పైలట్‌ కు సాహసమనే చెప్పాలి

Written By: NARESH, Updated On : July 24, 2024 6:08 pm
Follow us on

Nepal flight crash :  ఇంకా కొద్ది సేపట్లో తమ గమ్యం చేరుకుంటామని.. కుటుంబ సభ్యులను చూస్తామని.. అందరితో ఆనందంగా ఉంటామని కొందరు అనుకుంటే.. తను సెటిల్ అయ్యే రోజు వచ్చిందని ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదంచాలని మరికొందరు కలలు కంటారు. భవిష్యత్ తో మంచి ప్లయిన్ డ్రైవర్ కావాలి.. అలా అయితే.. ఇలాంటి ప్లెయిన్లను నడుపవచ్చు అని చిన్నారులు అనుకుంటుంటారు. వారి ఆశలన్నీ నిరాశలుగా మారాయి. కొద్ది సేపట్లో గమ్యం రాలేదు. వెనకే పొంచి ఉన్న మృత్యువు హత్తుకుంది. ఒక్కాసరిగా విమానం క్రాస్ ల్యాండ్ కావడంతో 18 మంది అక్కడికక్కడే కాలి భూడిదవగా.. ఒక్క పైలట్ మాత్రం కొన ఊపిరితో బతికి బయట పడ్డాడు. ఈ ఘటన నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో నేడు (జూలై 24-బుధవారం) ఘోర విమాన ప్రమాదం జరిగింది. త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతున్న ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ మినహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం టేబుల్‌ టాప్‌ రన్‌వేపై జరిగింది. ఇలాంటి రన్ వేస్ పై టేకాఫ్‌, ల్యాండింగ్‌ సవాళ్లతో కూడుకున్నది. విమాన ప్రమాదాల్లో అత్యధికం ఇలాంటి రన్‌వేలపైనే జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

అసలు ఏంటి ఈ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే?’
ఎత్తయిన ప్రదేశాల్లో ఉండే రన్‌వేలను ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అంటారు. ఈ రన్‌వేలు చుట్టూ ఉన్న భూ భాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి ఒకవైపు లేదంటే రెండు వైపులా లోయ ఉంటుంది. కొన్ని మీటర్ల ఎత్తు నుంచి చూస్తే రన్‌ వే, పక్కనున్న భూభాగం సమాంతరంగా ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. ఇక్కడ టేకాఫ్‌, ల్యాండింగ్‌ పైలట్‌ కు సాహసమనే చెప్పాలి. ఏ చిన్న పొరబాటు జరిగినా విమానం ఓవర్‌షూట్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ రోజు జరిగిన నేపాల్ ప్రమాదానికి ఇదీ ఒక కారణం అని తెలుస్తోంది.

ఓవర్‌ షూట్‌ అంటే
విమానం టేకాఫ్‌ లేదంటే ల్యాండ్ సమయంలో రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో నిర్ణయించి మార్కింగ్‌ చేసి ఉంటుంది. దీనినే పైలట్ అనుసరించాలి. కొన్నిసార్లు వర్షం లేదా ఇతరత్రా కారణాలతో రన్‌వే కన్పించకుంటే విమానం మార్కింగ్‌ను దాటి నేలను తాకుతుంది. దీన్నే ‘ఓవర్‌ షూట్‌’ అంటారు. సాధారణ రన్‌వేలపై ఇలా జరిగితే విమానం ఆగేందుకు అదనపు స్థలం ఉండాలి. కానీ, టేబుల్‌టాప్‌ రన్‌వేపై స్థలం ఉండదు కాబట్టి ఓవర్‌ షూట్‌ జరిగితే విమానం నేరుగా లోయలాంటి ప్రదేశంలో పడిపోతుంది.

భారత్‌లో 5 ఇవే..
నేపాల్ తరుచూ విమాన ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఇలాంటి రన్ వేలే కారణమని నిపుణులు చెప్తున్నారు. అక్కడ ఇలాంటి రన్ వేలు 7 ఉన్నాయట.
భారత్‌లో అవి 5 ఉన్నాయి. సిమ్లా (హిమాచల్‌ ప్రదేశ్‌), మంగళూరు (కర్ణాటక), కోజికోడ్‌ (కేరళ), పాక్యాంగ్‌ (సిక్కిం), లెంగ్‌పుయ్‌ (మిజోరం) ఈ తరహావే. 2020లో దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన కోజికోడ్‌ ప్లయిన్ యాక్సిడెంట్ ఈ రన్‌వేపైనే జరిగింది.

2020, ఆగస్ట్ కొవిడ్‌ సమయంలో ‘వందేభారత్‌ మిషన్‌’లో భాగంగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకొంది. అది ల్యాండ్‌ అవుతుండగా అదుపు తప్పి రన్‌వే నుంచి జారి 35 అడుగుల లోయలో పడిపోయింది. విమానంలో 190 మంది ఉండగా.. ఇద్దరు పైలట్లతో పాటు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి పదేళ్ల క్రితం 2010, మే 22న దుబాయ్‌ నుంచి మంగళూర్ వచ్చిన మరో ఎయిర్‌ ఇండియా విమానం కూడా ఇదే తరహాలో ప్రమాదానికి గురవగా.. 158 మంది ప్రాణాలు కోల్పోయారు.