Solar Eclipse 2022: మన దేశంలో గ్రహణాల విషయంలో ఎన్నో అనుమానాలున్నాయి. గ్రహణాల సమయంలో తినకూడదని, తాగకూడదని, స్నానం కూడా చేయొద్దని, అసలు మూత్రం కూడా పోయరాదనే నిబంధనలు ఉన్నాయి. గ్రహణం అనేది ప్రకృతి సిద్ధంగా జరిగే ఓ ప్రక్రియ. దాని మీద ఇన్ని రాద్ధాంతాలెందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది చేయకూడదు అది చేయకూడదని ప్రజలను భయానికి గురి చేస్తున్నారు. దీంతో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహజమైన వాటి మీద ఎందుకు అన్ని నిబంధనలు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 25న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో అందరు పండుగ ఎప్పుడు జరుపుకోవాలనేదానిమీద ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పండితులు మాత్రం గ్రహణం 25న ఉండటంతో 24నే దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఏం చేయాలో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. పండుగ ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో దీపావళి గురించి అయోమయం నెలకొంది. సూర్య గ్రహణ ప్రభావంతో పండుగను ఒక రోజు ముందుకు జరిపిన విషయం తెలిసిందే.
అసలు గ్రహణానికి మనుషులకు సంబంధం ఉందా? అది గ్రహాల మధ్య ఉన్న సంబంధమే. కానీ మనుషులకు దానితో ఏం అవసరం ఉండదు. మనవారు మాత్రం గ్రహణాలు సైతం మనపై ప్రభావం చూపుతాయని ప్రచారం చేశారు. గర్భిణీలు గ్రహణ సమయంలో ఏం చేయకూడదని చెబుతుంటారు. వారు గ్రహణాన్ని చూడొద్దని కూడా భయపెడుతుంటారు. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు మొర్రి వస్తుందని ప్రచారం చేస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదు. గ్రహణం మొర్రికి గ్రహణానికి అసలు సంబంధమే లేదని వైద్యులు చెబుతున్నారు. శాస్త్రం కూడా అదే చెబుతుంది.

మన పండితులు మాత్రం గ్రహణం సమయంలో తినడం చేయకూడదని నిబంధన విధించారు. అలాగే తాగకూడదు. స్నానం కూడా చేయొద్దట. మూత్ర విసర్జన కూడా వద్దని సూచిస్తుంటారు. దీంతో మనకు గ్రహణం సమయంలో ఏం చేయకుండా ఉంటే ఎలా? ఉండగమా? అనే సందేహాలు కూడా అందరిలో వస్తుంటాయి. సాధారణ పరిస్థితుల్లో చేసినట్లే గ్రహణ సమయంలో కూడా అన్ని చేసుకోవచ్చని సైన్స్ చెబుతోంది. మన పూర్వీకులు పెట్టిన షరతులు పాటించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. గ్రహణానికి మనకు ఎలాంటి సంబంధాలు ఉండవని పేర్కొంటున్నారు.