
Prevent Gastric Problems : ఇటీవల కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు వేధిస్తున్నాయి. వయసు ప్రభావంతో చాలా మందికి అజీర్ణం పెద్ద ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో వారు అనేక ఆస్పత్రులు తిరుగుతూ ఏవో మందులు వాడుతున్నారు. దీని వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా సమస్య దూరం కావడం లేదు. ముసలి వారు తినే తిండి వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు.
పొట్ట ఉబ్బరంగా ఉంటూ తేన్పులు వస్తున్నాయంటే గ్యాస్ట్రిక్ సమస్యగానే చూస్తారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాల వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పొట్టలోపేరుకుపోయిన వ్యర్థాలతో కడుపు ఉబ్బరంగా మారుతుంది. దీంతో మనం తిన్నది కూడా జీర్ణం కాదు. పుల్లటి తేన్పులు వస్తాయి. దీని వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

ఇలా జరగడానికి కారణాలు ఉన్నాయి. మన రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం. లాలాజలం తగినంత ఉత్పత్తి కాకపోవడం. లాలాజలం తగినంత ఉంటే మనం తిన్న పదార్థాలు జీర్ణం అవుతాయి. ఇలాంటి కారణాలతో మనకు అజీర్తి తిప్పలు పెట్టడం కామనే. ఈనేపథ్యంలో గ్యాస్ట్రిక్ ఇబ్బందుల నుంచి బయట పడటానికి ఎన్నో రకాల చర్యలు తీసుకోవాల్సిందే.
వయసు మళ్లిన వారిలో ఆహారం త్వరగా జీర్ణం కాదు. వారి అవయవాలు త్వరగా పనిచేయవు. దీంతో వారు తొందరగా జీర్ణం అయ్యే వాటిని తీసుకోవడం ఉత్తమం. మసాలాలు తీసుకోకపోతేనే ప్రయోజనం ఉంటుంది. జాగ్రత్తలతో కూడిన ఆహారాలు తీసుకుంటేనే ముసలి వారికి సమస్యలు రావు. ఇంకా థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటేనే ఫలితం ఉంటుంది.