Husband And Wife: భార్య మనసు గెలవాలంటే భర్త ఏం చేయాలి

కనీసం భర్త అయినా ఆమె సంతోషం గురించి ఆలోచించాలి. ఇంటిల్లి పాదికి ఏం కావాలి? ఎవరిని ఎలా చూసుకోవాలి? పిల్లలకు ఏం కావాలి? అత్తమామకు ఏం కావాలి? భర్తకు సమయానికి వంట ఎలా అందించాలి అని ఆలోచిస్తూనే చిటికెలో అన్ని పనులు చేసేస్తుంటుంది ఆ ఇల్లాలు. అలుపెరుగని ఆమె ప్రయాణం చాలా గొప్పది.

Written By: Swathi, Updated On : March 12, 2024 1:14 pm

Husband And Wife

Follow us on

Husband And Wife: ఈ సమాజంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి పెళ్లి అనే బంధంతో ఒకరికి ఒకరు తమ జీవితాలను పంచుకుంటారు. కేవలం మూడు ముళ్లు వేయడంతో ఆ వ్యక్తిని భర్తగా అంగీకరించి అత్తగారింటికి వెళ్లి ఇక నా జీవితం నా ప్రపంచం ఇక్కడే అని సిద్దమవుతుంది ఆడపిల్ల. తల్లిదండ్రి, పుట్టిన ఊరు అందరిని వదిలేసి వచ్చే ఆ అమ్మాయిని సంతోషంగా చూసుకోవడం ఆ అత్తింటి కర్తవ్యం. ఆమెకు కావాలని కష్టం తేకూడదు. ఆమె కంట నీరు తెప్పించకూడదు.

కనీసం భర్త అయినా ఆమె సంతోషం గురించి ఆలోచించాలి. ఇంటిల్లి పాదికి ఏం కావాలి? ఎవరిని ఎలా చూసుకోవాలి? పిల్లలకు ఏం కావాలి? అత్తమామకు ఏం కావాలి? భర్తకు సమయానికి వంట ఎలా అందించాలి అని ఆలోచిస్తూనే చిటికెలో అన్ని పనులు చేసేస్తుంటుంది ఆ ఇల్లాలు. అలుపెరుగని ఆమె ప్రయాణం చాలా గొప్పది. ఆరోగ్యం బాగలేకపోయినా, ఎంత ఇబ్బంది ఉన్నా.. ఇంట్లో వారికోసం తన ఒల్లును కష్టపెడుతూనే ఇంటిల్లిపాదికి సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. మరి ఆమె కోసం భర్త ఆలోచించాలి కదా..

కూర వండిపెట్టినప్పుడు ఏమే ఈ రోజు కూర బాగుందే.. అంటే చాలు గంట సేపు వంటకోసం పడ్డ కష్టాన్ని సెకన్ లో మర్చిపోతుంది. రోజు మొత్తం జీతం లేని పని చేస్తూ… భర్త తెచ్చే మూరె మల్లెపూలతో మురిసిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఆయన తెచ్చే చీరనే ఆమెకు ఇంద్రధనుస్సు. కాలచక్రంలో జీవితం గడిసిపోతుంటే.. భర్త పొగడ్తలే ఆమెకు పౌర్ణమి వెలుతురులు. అప్పుడప్పుడు కాస్త వంటింట్లో సాయం, లేదా అలసి పోతున్నావా అనే మాట ఆమెకు కొండంత అండ. పనిలో సాయం చేయకపోయినా.. నువ్వు నా లక్కీ పర్సన్ అంటే చాలు లక్ష పనులు అయినా అలవోకగా చేస్తుంది మీ ఇంటి మహాలక్ష్మీ.

ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట భార్యలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇంట్లో పనుల కోసం ఉదయం 4గంటలకు తమ గడియారం మొదలైతే.. 9కి ఆఫీస్ కి ఆ తర్వాత ఇంటికి 6. వచ్చాక మళ్లీ ఇంట్లో పనులు. డబ్బు సంపాదిస్తూనే ఇంటి పనులను కూడా ఇష్టంగా చేసే ఆ ఇల్లాలిని కష్టపెట్టకుండా అర్థం చేసుకుంటే సరిపోదా.. కానీ అయినా ఆమెకు ఈసడింపులే.. ఆరోగ్యం బాగలేకపోయినా అడిగే భర్త లేకపోతే పెళ్లి బందానికి..ఆమె పడే కష్టానికి అర్థం ఏమిటి? అందరిని వదిలేసి వచ్చిన తన త్యాగానికి విలువ ఏమిటి? సో కాస్త ఆలోచించండి హస్బెండ్లు. మీ భార్యామణి కోసం మణీ బ్యాంక్ తీసుకురావాలా? కనీసం ఆమె గురించి కేర్ తీసుకుంటే చాలా? ఎందులో ఉందో ఆమె సంతోషం? థింక్ వన్స్.. తర్వాత అంత హాపీనే..