Dengue Fever Precautions: ఎండలు ఎందుకు పెరుగుతాయి? చెట్లు లేకపోడం వల్ల, లేదా చెట్లు నరకడం వల్ల, పారిశ్రమల కాలుష్యం వల్ల.. నిన్నామొన్నటి దాకా ఈ ఎండలు పెరిగితే మనుషులు, ఇతర ప్రాణ కోటి ఇబ్బంది పడేది. ద్రువపుప్రాంతాల్లో మంచు కరిగేది, ఇంకా కొన్ని రకాల జంతువులు కాలగర్భంలోకి కలిసిపోయేవి. నిన్నామొన్నటి వరకూ మనకు తెలిసిందింది ఇదే. మనము చదువుకున్నదీ ఇదే. ఇప్పుడు కొత్త విషయాన్ని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఇంతకీ జరగబోయే ఆ ఉత్పాతం ఏంటి?
దోమల సంతతి పెరుగుతోంది
ఎండలు పెరిగిపోతున్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డవుతు న్నాయి. ఫలితంగా దోమల సంతతి ఎక్కువువుతోంది. ఫలితంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది. డెంగ్యూ తీవ్రత ఎక్కువై మహమ్మారి ముప్పులా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘గతేడాది ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. 2022లో అన్ని దేశాల్లో కలిపి 42 లక్షల కేసులు వచ్చాయి. ఈ ఏడాది అమెరికాలో ఇప్పటికే 30 లక్షలకు పైగా డెంగ్యూ పాజిటివ్‌లు నమోదయ్యాయి. 2019లో 129 దేశాల్లో 52 లక్షల కేసులు వచ్చాయి. ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అఽధిక ఉష్ణోగ్రతల వల్ల దోమలు సంతతిని అతి వేగంగా పెంచుకుంటున్నాయి. అదే సమయంలో వాటి శరీరంలోని వైర్‌సను కూడా రెట్టింపు చేసుకుంటున్నాయి’ అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. డెంగ్యూ సోకిన వారిలో మరణాలు ఒక శాతంలోపే ఉన్నట్లు తెలిపింది.
మన దగ్గర విపరీతంగా కేసులు
మన దేశంలోనూ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. 2012లో 32 రాష్ట్రాల్లో 50,222 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ఏటా కేసుల పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇక 2016 నుంచి ఏటా దేశవ్యాప్తంగా లక్షకుపైగానే కేసులు వస్తున్నాయి. 2019లో 2,05,243 కేసులు నమోదయ్యాయి. 2020లో కొవిడ్ కారణంగా డెంగ్యూ తీవ్రత అం తగా కనిపించలేదు. 2021లో 1,93,245 కేసులు, 2022లో 2,33,251 పాజిటివ్‌లు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇలా..
గతేడాది తెలంగాణలో 8,972 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 2.33 లక్షల కేసులొచ్చాయి. పశ్చిమబెంగాల్లో దేశంలోనే అత్యధికంగా 67,271 కేసులొచ్చాయి. ఇక 6 రాష్ట్రాల్లో పది వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీల్లో ఎక్కువ కేసులొచ్చాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 58 శాతం కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇక డెంగీ పెరగడానికి ఎంటమాలజిస్టుల కొరత కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే 2019లో డెంగ్యూ విజృంభించడంతో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 50 మంది దాకా మరణించారు. అప్పట్లో ఇక్కడ ఆరోగ్యపరంగా ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని విధించింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What precautions should be taken to prevent dengue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com