Control Sugar Levels: ప్రస్తుతం మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరికి డయాబెటిస్ ఉంటోంది. ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధి సాధారణంగా మారింది. ప్రతి వారిలో ఓ అలవాటుగా మారింది. దీంతో షుగర్ ను నియంత్రణలో ఉంచుకునేందుకు పలు పాట్లు పడుతున్నారు. పూర్వం రోజుల్లో ధనవంతుల వ్యాధిగా చెప్పేవారు. ఏ పనిచేయకుండా ఉండే వారికి వచ్చే వ్యాధిగా దీనికి పేరుండేది. కాలక్రమంలో దీని విస్తరణ పెరుగుతోంది. చైనా, ఇండియాలో ఈ వ్యాధి ఎక్కువగా రావడానికి కారణం మన ఆహారమే. మనం అన్నం ఎక్కువగా తినడం వల్లే షుగర్ వస్తోందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి వారసత్వం కూడా ఓ కారణంగా సూచిస్తున్నారు. ఇంకా కొందరిలో మాత్రం మారిన జీవన శైలితోనే మధుమేహం ఆవహిస్తోందని చెబుతున్నారు.

మన రోజువారీ కార్యకలాపాలు కూడా మనకు చక్కెర వ్యాధి రావడానికి అవకాశాలు కల్పిస్తోంది. ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి. లేకపోతే షుగర్ లెవల్స్ పడిపోతాయి. దీంతో కళ్లు తిరడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో మధుమేహులు ఉదయం పూట మాత్ర వేసుకున్నాక కచ్చితంగా అల్పాహారం తీసుకుంటే మంచిది. అందులో ఇడ్లీ, దోశలు కాకుండా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బియ్యంతో చేసినవి తినడం శ్రేయస్కరం కాదు.
మధ్యాహ్నం పూట భోజనంలో ఒక పుల్కా అరకిలో కూర పెట్టుకోవాలి. అందులో ఆకుకూరలు ఉంచుకుంటే లాభం. ఒకటి లేదా రెండు పుల్కాలు ఆకుకూరతోపాటు ఇంకా ఏదైనా కూరగాయలతో చేసిన కూర ఓ కప్పు పెరుగు తీసుకోవాలి. మధుమేహులు తీవ్రమైన ఎండలో ఎక్కువ సేపు ఉంటే కష్టమే. ఎండలో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో షుగర్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండటమే మంచిది. ఇందులో చక్కెర ఉండటంతో వీటిని దూరం చేసుకుంటేనే మేలు. వీటితో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

నిద్ర కూడా ముఖ్యమే. మధుమేహులు సరిగా నిద్ర పోకపోతే ఇంకా ఇతర జబ్బులు రావడానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెంచేస్తాయి. ఈ నేపథ్యంలో చిగుళ్ల వ్యాధి ఉన్న వారిలో షుగర్ వ్యాధి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగిన నీరు లేకపోయినా సమస్య ఎక్కువవుతుంది. స్వీట్లు, బేకరి ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటివి తినకూడదు. మధుమేహులు అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందే.