Sleep Health: మనకు పడుకున్నప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి. కలల్లో ఎక్కడికో వెళ్లినట్లు ఏదో చేస్తున్నట్లు అనిపించడం మామూలే. ఒక్కోసారి ఏదో ఆవహించినట్లు అనిపిస్తుంది. కలలు కొందరికి గుర్తుంటాయి. ఇంకొందరు మరిచిపోతుంటారు. వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. గాఢనిద్రలో ఉన్నప్పుడు మనకు కలలు రావడం సహజమే. మరికొందరు పగటిపూట కూడా కలలు కంటుంటారు. అందులో రెండు రకాలు ఉంటాయి. కొన్ని పీడకలలు. మరికొన్ని మంచి కలలు. అంటే కలల్లో మనం ఏదో సాధించినట్లు మనకు డబ్బు బాగా దొరికినట్లు కూడా వస్తుంది. ఇలా కలలు మనల్ని రకరకాలుగా వేధిస్తుంటాయి.

మనకు కలలో మన మీద ఏదో కూర్చుకున్నట్లు కూడా ఒక్కోసారి అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో మనం కదలలేం. మెదలలేం. నోరు కూడా రాదు. మాట తడబడుతుంది. ఇలాంటి పరిస్థితి జీవితంలో ఒక్కసారైనా ఎదుర్కొనే వారు చాలా మంది ఉంటారు. మనం నిద్ర పోయేటప్పుడు మన చేతులు చాతీ మీద ఉంటే అది గుండెకు భారంగా అనిపించి మన మెదడు అన్ కాన్సియస్ లోకి వెళ్తుందట. దీంతో మనకు మీద ఏదో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుందట. ఇది శాస్త్రీయంగా చెబుతున్న మాట.
Also Read: AP Debts: జగన్ దెబ్బకు బ్యాంకుల కొంప కొల్లేరు
కొందరేమో తమకు దెయ్యం పట్టిందని చెప్పి నానా హంగామా చేస్తుంటారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో గతంలో ఒకసారి ఇలాగే ఊరికే దెయ్యం పట్టిందని ప్రచారం చేసి దెయ్యాన్ని తరిమేందుకు డబ్బులు కూడా వసూలు చేసినట్లు తెలిసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో వైరల్ అయింది. అన్ని చానళ్లు ఈ వార్తను ప్రసారం చేశాయి. ఇలా మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఈ సమస్యను శాస్త్రీయ కోణంలో చూడకుండా మనిషి తన మూఢత్వంతో చూస్తూ ఏదో జరిగిందని భయపడుతున్నాడు.

ఫలితంగా దెయ్యం పట్టిందనే అపోహకు వస్తున్నారు. అమెరికాలో ఒక శాతం జనాభా ఇలాంటి పరిణామాన్ని జీవితంలో ఒకసారి ఎదుర్కొన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. నిద్రలో వచ్చే కలలకు దెయ్యాలను ఆపాదించి చెడు మార్గాలకు వెళ్లకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచించి ఎలాంటి మూఢ నమ్మకాలను నమ్మకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మనిషి తెలివితో ఎన్నో కనిపెడుతున్నా ఇంకా ఈ మూఢనమ్మకాల బారిన పడి నష్టపోతున్నారు. ఇప్పటికైనా మూఢనమ్మకాల బారిన పడకుండా తెలివితో ఆలోచించి కలల గురించి అనవసర భయాందోళనలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
Also Read:Jagan To Meet Party Workers: వైసీపీలో జగన్ కు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?
Recommended Videos


