Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలో టీ20, వన్డే కప్ లు దక్కించుకుని వాటికి సవాలు విసిరారు. ఆటగాళ్ల ఫామ్ పై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు. సహచరులు ఎలా రాణించాలనేదానిపై చర్చిస్తుంటాడు. వరుస విజయాలు అందుకుంటూ కెప్టెన్సీపై పట్టు బిగిస్తున్నాడు. జట్టును విజయపథంలో నడిపిస్తూ సరైన సమయంలో దిశానిర్దేశం చేస్తూ ఆటగాళ్ల సేవలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఫలితంగా విజయాలు అందుకుంటున్నాడు. టీమిండియాకు తిరుగులేని ఆధిపత్యం తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై అందరికి భరోసా కలుగుతోంది.

ఈ మేరకు రోహిత్ శర్మ ఫాలో ది బ్ల్యూస్ అనే కార్యక్రమంలో తన మనసులోని మాటలను వెల్లడించాడు. తన కెప్టెన్సీ విజయ రహస్యాలను బద్దలు కొట్టాడు. పరిస్థితులు ఎప్పుడు వ్యతిరేకంగా కాకుండా సరళంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని ఇదే తన విజయ రహస్యంగా అభివర్ణించాడు. జట్టులో సభ్యులకు కావాల్సిన స్వేచ్ఛనిస్తూ వారిని తమదైన శైలిలో ఆడేలా ప్రోత్సహిస్తానని చెబుతున్నాడు. విషయాలు సరళంగా, తేలిగ్గా ఉండేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. టీంలో ఎవరి బాధ్యతలు వారికి అర్థమయ్యేలా చెబుతుంటానన్నాడు.
కోచ్ రాహుల్ ద్రవిడ్, తాను జట్టు సభ్యులకు ఏం కావాలనేదానిపై చర్చించి తెలియజేస్తాం. ఈ విషయంలో ద్రవిడ్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే ఆటగాళ్ల ఫామ్ కోసం సూచనలిస్తుంటాం. వారిని సమర్థంగా ఆడేందుకు ప్రోత్సహిస్తుంటాం. దీంతోనే తమ జట్టు మంచి ఫామ్ లో కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు అందుకుని ప్రేక్షకుల అంచనాలు నిజం చేస్తాం. ఆసియా కప్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేసి కప్ దక్కించుకుంటాం.

ఏ క్రీడాకారుడైనా ఫామ్ కోల్పోతే సమస్య ఎక్కడుందో గుర్తించి మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తాం. అతడు తిరిగి ఫామ్ లోకి రావాలంటే ఏం చేయాలనేదానిపై సలహాలు ఇస్తుంటాం. దీంతో సమస్యను గుర్తించి వారి బలహీనతలను దూరం చేసేందుకు కృషి చేస్తుంటాం. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ గా ఎక్కువ దృష్టి సారించి జట్టుకు సమష్టిగా ప్రయోజనం కలిగేందుకు ప్రయత్నిస్తుంటా. ఆటగాళ్ల గురించి ఆలోచించి వారి ఆటతీరు మార్చుకునేందుకు తోడ్పడుతుంటాను. అందుకే టీమిండియా మంచి ఫామ్ లో కనిపిస్తోంది.