Marriage Age: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుకగా భావిస్తారు. ఇలా ఇంట్లో కూతురు లేదా కొడుకు పెళ్లి ఈడుకి రాగానే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయడం మనం చూస్తున్నాము.అయితే ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువత వారి చదువులు భవిష్యత్తు ఉద్యోగం అంటూ సంపాదన తర్వాత పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అబ్బాయిలు 30 దాటే వరకు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. అలాగే అమ్మాయిలు కూడా 26 సంవత్సరాల తర్వాతనే వివాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇలా వివాహం చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని చెపుతున్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి.. ఏ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా ఒక అబ్బాయి 22 నుంచి 26 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవడం ఎంతో మంచిది. అబ్బాయి ఈ వయసులో ఉన్నప్పుడు వారిలో శుక్రకణాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అందుకే ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వారు శృంగార జీవితాన్ని అనుభవించడమే కాకుండా తొందరగా వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకు కూడా 18 నుంచి 22 సంవత్సరాలలోపు పెళ్లి చేయడం ఎంతో మంచిది. ఈ వయసులో అమ్మాయిల గర్భాశయం కూడా ఎంతో వృద్ధి చెంది అండాల ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరికి సంతానం తొందరగా కలుగుతుంది.
అలా కాకుండా అమ్మాయిలు వయసు 26 సంవత్సరాలు అబ్బాయి వయసు 30 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకోవడం వల్ల వీరిలో శృంగారపరమైన కోరికలు తగ్గిపోవడమే కాకుండా వీరిలో శుక్రకణాలు, అండాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీంతో శృంగార కోరికలు తగ్గిపోవడంతో పాటు వీరికి సంతానం కలగడం కూడా ఇబ్బందిగా మారిపోతుంది. అందుకే సరైన సమయంలోనే వివాహం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలామంది 30 తర్వాత వివాహం చేసుకున్న వీరిలో పిల్లలు కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఇలాంటి వారు పెళ్లిళ్లు చేసుకున్న చాలా మంది విడాకులు తీసుకుంటున్నారని పలు నివేదికల ద్వారా వెల్లడించారు.