Home Loan: ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బు ఉన్న వారు ఒకేసారి పెట్టుబడి పెట్టి ఇల్లు నిర్మించుకుంటారు. కాస్త తక్కువ ఉన్న వారు రుణ సాయంతో ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. నేటి కాలంలో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇల్లు నిర్మించుకోవడానికి అనేక రకాలుగా రుణ సాయం చేస్తున్నాయి. తక్కువ వడ్డీతో ఇల్లు నిర్మాణానికి దాదాపు 80 శాతం వరకు లోన్ రూపేణా నగదును అందిస్తున్నాయి. అయితే అప్పటి వరకు ఇల్లు లేని వారు నివాసం కోసం ఇల్లు నిర్మించుకోవడం ఒక పని. కానీ కొందరు పెట్టుబడులు పెట్టడానికి రెండో ఇల్లు నిర్మిస్తారు. దీని కోసం కూడా రుణం తీసుకుంటారు. ఇలా తీసుకోవడం మంచిదేనా? ఇలా రెండో ఇంటి కోసం అప్పు చేస్తే ఏమవుతుంది?
చాలా మంది ఆదాయం పెరిగిన కొద్దీ వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. వీరు నేరుగా వ్యాపార రంగంలోకి దిగకపోయినా కొన్నింటిలో పెట్టుబడులు పెట్టి లభాలను ఆర్జిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి 60 శాతం కంటే ఎక్కువగా ప్రావిట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఇండిపెండెట్ స్థలాలు, అపార్టుమెంట్ లు, ఇల్లు నిర్మించడానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే డబ్బులు అదనంగా ఉన్న వారు ఇలాంటి పెట్టుబడులు పెడితే పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకోవచ్చు. కానీ రుణ సాయంతో ఈ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందంటే?
ఒక ఇల్లు ఉన్నా కూడా రెండో ఇల్లు నిర్మించడానికి కొందరు రుణ సాయం ఆర్జిస్తారు. ఇందు కోసం బ్యాంకులను సంప్రదించి లోన్ తీసుకుంటారు. రెండో ఇల్లు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో అవసరం ఉంటుందా? అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అలాగే ఈ ఇల్లును నివాస యోగ్యానికా? లేదా సెలవుల్లో సరదాగా ఉండడానికా? అనేది స్పష్టత ఉండాలి. కేవలం పెట్టుబడుల కోసమే దీనిని నిర్మిస్తున్నారా? లేక అవసరం కోసం నిర్మిస్తున్నారా? అనేది నిర్ణయించుకోవాలి. కేవలం పెట్టుబడుల కోసమే అయితే భవిష్యత్ లో నష్టం వస్తే ఎలా తట్టుకోగలుగుతారు? అనేది చూడాలి.
అయితే ఇప్పటికే ఒక ఇల్లు నిర్మించడానికి రుణం తీసుకుంటే.. అది పూర్తి కాకముందే కొత్త రుణం చేయడమూ మంచిది కాదు. అంతేకాకుండా డౌన్ పేమెంట్ ఇప్పటికే చేతిలో ఉందా? లేదా దాని కోసం కూడా అప్పులు చేస్తున్నారా? అలా అయితే కూడా ఈ పెట్టుబడులు అంత మంచిది కాదు. రెండోసారి హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడు ప్రస్తుతం వడ్డీ రేటు, భవిష్యత్ లో పెరిగే రేటును దృష్టిలో ఉంచుకొని అందుకు చెల్లించేందుకు సంసిద్ధంగా ఉండాలి.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ ప్రావిట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే సమయంతో ఒక్కసారి నష్టాలు కూడా రావొచ్చు.ప్రతికూల పరిస్థితుల కారణంగా భూములు లేదా ఇళ్ల ధరలు ఒకేసారి పడిపోవచ్చు. ఇలా కేవలం ఇల్లు నిర్మించి సేల్ చేయడానికి రుణం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రుణభారం ఉండగా నష్టం వస్తే భరించే శక్తి అందరికీ ఉండదు. అందువల్ల ఆదాయ మార్గాలు బాగా ఉంటేనే రెండోసారి గృహరుణం తీసుకోవాలి. లేకుంటే దీనికి దూరంగా ఉండడమే మంచిది.