https://oktelugu.com/

Bigg Boss OTT Season 2: బిగ్ బాస్ లవర్స్ కి భారీ షాక్… ఊరించి ఉసూరుమనిపించారుగా?

బిగ్ బాస్ ఓటిటీ కి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశారని ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. రెండేళ్ల క్రితం వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కి మంచి ఆదరణ లభించింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2024 / 06:03 PM IST

    Bigg Boss OTT Season 2

    Follow us on

    Bigg Boss OTT Season 2: బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ సక్సెస్ అయింది.ఉల్టా పుల్టా అంటూ కొత్త కంటెంట్ తో షో రన్ చేశారు. ఈ సీజన్ 7 కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జనాల్లో ఉన్న బిగ్ బాస్ ఫీవర్ క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 ప్రారంభించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.

    బిగ్ బాస్ ఓటిటీ కి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశారని ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. రెండేళ్ల క్రితం వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కి మంచి ఆదరణ లభించింది. ఆ సీజన్ లో నటి బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచింది. కాగా రెండో సీజన్ ని భారీగా లాంచ్ చేయబోతున్నారట. ఈ షో ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో ఓటిటీ సీజన్ 2 లో పాల్గొనేందుకు పలువురి సెలెబ్రెటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

    దీంతో షో ప్రారంభం అవ్వక ముందే దీని అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో బిగ్ బాస్ ఓటిటీ సీజన్ కోసం బాగ్ బాస్ లవర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త సీజన్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వాహుకులు రద్దు చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. కొన్ని కారణాల వలన ఫిబ్రవరి లో ప్రారంభం కానున్న కొత్త సీజన్ ని ఆపేస్తున్నట్లు తెలుస్తుంది.

    అంతేకాదు బిగ్ బాస్ సెట్ వేసే స్టూడియోను మరో ఛానల్ కొత్త షో కోసం బుక్ చేసుకుందని సమాచారం. కానీ ఈ సీజన్ ని ఎందుకు రద్దు చేశారు అనేది తెలియలేదు. బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి నిరాశే మిగిలింది.