Hanuman Pre Release Business: 2024 సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ తో పాటు, సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ బరిలో దిగారు. వీరితో యంగ్ హీరో తేజ సజ్జా జాయిన్ అయ్యాడు. రవితేజ ఈగిల్ మూవీ కూడా విడుదల కావాల్సింది. థియేటర్స్ సమస్యల తలెత్తడంతో బ్రతిమిలాడి ఈగిల్ చిత్రాన్ని వాయిదా వేయించారు. హనుమాన్ చిత్ర విడుదల కూడా ఆపాలని నిర్మాతలపై ఒత్తిడి తెచ్చారు. హనుమాన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో వారు వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలో అతి తక్కువ థియేటర్స్ హనుమాన్ చిత్రానికి దక్కాయి. అత్యధికంగా గుంటూరు కారం మూవీ థియేటర్స్ కైవసం చేసుకుంది. తర్వాత నా సామిరంగ, సైంధవ్ చిత్రాలు థియేటర్స్ దక్కించుకున్నాయి. ఇక చిన్న హీరో అయినప్పటికీ హనుమాన్ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఆకట్టుకోగా బజ్ ఏర్పడింది. దాంతో హనుమాన్ చిత్ర థియేట్రికల్ హక్కులు అత్యధిక ధరలకు అమ్ముడుపోయాయి.
హనుమాన్ థియేట్రికల్ బిజినెస్ గమనిస్తే… నైజాం హక్కులు రూ. 7.5 కోట్లకు అమ్మారు. సీడెడ్ రూ. 4 కోట్లు, ఆంధ్రా రూ. 10 కోట్లకు విక్రయించారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ రూ. 2.5 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక ప్లస్ రెస్టాప్ ఇండియా కలిపి రూ. 2 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ హక్కులు రూ. 4 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. కాబట్టి వరల్డ్ వైడ్ హనుమాన్ రూ. 27.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.
ఇది తేజ సజ్జా కెరీర్ హైయెస్ట్ అని చెప్పాలి. తేజ సజ్జా ఎదుట భారీ టార్గెట్ ఉంది. రూ. 28.5 కోట్లు వస్తే కానీ హనుమాన్ హిట్ స్టేటస్ అందుకోదు. సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ అంత పెద్దదేమీ కాదు. హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ చేస్తుంది. తేజ సజ్జా సూపర్ మాన్ గా కనిపిస్తాడనే మాట వినిపిస్తుంది.