Pancard Numher: ఆర్థిక వ్యవహారాలు నడిపేందుకు నేటి కాలంలో Pancard తప్పనిసరి. ప్రతీ వ్యక్తికి ఒకటే పాన్ కార్డు నెంబర్ ఉంటుంది. దీనిని మార్చుకోవడానికి వీలు ఉండదు. ఒకవేళ పాన్ కార్డు దొంగిలించబడినే నకిలీది మాత్రం తీసుకోవచ్చు. ఇప్పడున్న పరిస్థితుల్లో బ్యాంకు అకౌంట్ తీయాలంటే పాన్ కార్డు తప్పనిసరి చేశారు. దీంతో పాన్ కార్డు వ్యాల్యూ పెరిగిపోయింది. అయితే పాన్ కార్డుతో బ్యాంకు అకౌంట్ వివరాలు లింకై ఉంటాయి. దీంతో పాన్ కార్డుతో బ్యాంకులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. దీని ద్వారా రుణం కూడా తీసుకోవచ్చు. ఇదే సమయంలో దీని ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉంది. ఎలాంటి మోసాలు ఉంటాయంటే?
ఇప్పుడున్న రోజుల్లో బంగారం, డబ్బు కంటే విలువైన కార్డులు, పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల డేటా చోరీ చేస్తే వారి బ్యాంకు ఖాతాలపై కన్నేస్తున్నారు. ముఖ్యంగా ఆధార్, పాన్ కార్డుల వివరాలు తెలుసుకొని వాటి ఆధారంగా సొంత వినియోగదారుడికి తెలియకుండా ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నారు.
పాన్ కార్డు ఆధారంగా చాలా బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. దీంతో వినియోగదారులకు తెలియకుండానే వారి పాన్ కార్డు ఆధారంగా లోన్లు తీసుకున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ సినీ సెలబ్రెటీలకు సంబంధించి పాన్ కార్డులను కొందరు దొంగిలించి వారి పేరిట లోన్లు తీసుకున్నారు. పాన్ కార్డు ద్వారా ఇలా తెలియకుండా వేరేవాళ్లు లోన్లు తీసుకొని మూడు నెలల పాటు ఈఎంఐ కట్టనందుకు బ్యాంకు నోటీసులు పంపుతుంది. ఆ నోటీసులు అసలైన ఖాతాదారుడి ఇంటికే వస్తాయి.
ఈ నేపథ్యంలో పాన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అసవరం లేని చోట పాన్ కార్డు నెంబర్ ఇవ్వడం మానేయాలంటున్నారు. అత్యవసరమైతే తప్ప.. గుర్తింపు ఉన్న సంస్థలకు మాత్రమే పాన్ కార్డు నెంబర్ చెప్పాలని అంటున్నారు. లేకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఒకసారి పాన్ కార్డు ద్వారా మోసం జరిగిగే సిబిల్ స్కోర్ వాళ్లకి కంప్లయింట్ చేయొచ్చు. దీని ద్వారా వారు పరిష్కారం చూపుతారు.