Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ హాట్ యాంకర్ ఒకప్పుడు బుల్లితెరను ఊపేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ షేక్ చేస్తుంది. ఏళ్ళ తరబడి అనసూయ జబర్దస్త్ యాంకర్ గా ఉన్నారు. సదరు టాప్ రేటెడ్ షోకి అనసూయ గ్లామర్ మరో ఆకర్షణ. బుల్లితెర మీద అనసూయ స్కిన్ షో చేయడం విమర్శలకు దారి తీసింది. అనసూయ విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. తాను ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పేందుకు మీరెవరు అంటుంది అనసూయ.
గత ఏడాది యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నానని అనసూయ అన్నారు. ఏకకాలంలో యాకరింగ్, యాక్టింగ్ చేయడం వలన ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతున్నారట. యాంకరింగ్ వదిలేయడానికి ఇది కూడా ఓ రీజన్ అని చెప్పింది. 2023లో అనసూయ నుండి మంచి చిత్రాలు వచ్చాయి. రంగమార్తాండ చిత్రంలో మోడ్రెన్ కోడలి పాత్రలో ఆకట్టుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే విమానం మూవీలో మరో ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఏకంగా వేశ్యగా నటించింది.
పెదకాపు 1లో కూడా అనసూయ పాత్ర చాలా కీలకం. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో అనసూయ గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోలేదు. అనసూయ చేతిలో ఉన్న క్రేజీ మూవీ పుష్ప 2. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో అనసూయ పాత్రకు చెప్పుకోదగ్గ నిడివి ఉందట. సునీల్, ఫహద్ కాంబినేషన్ లో వచ్చే ఆమె సన్నివేశాలు అలరిస్తాయని ఇటీవల చెప్పింది. బన్నీ-సుకుమార్ ల ఈ పాన్ ఇండియా మూవీ 2024 ఆగస్టు 15న విడుదల కానుంది.
నటిగానే కాకుండా ప్రొమోషన్స్ ద్వారా అనసూయ భారీగా ఆర్జిస్తోంది. ఆమెకున్న డిమాండ్ రీత్యా షాపింగ్ మాల్స్ ఓనర్స్ ఓపెనింగ్ కి ఆహ్వానిస్తున్నారు. లక్షలు డిమాండ్ చేస్తున్నా వెనుకాడకుండా అనసూయను తీసుకొస్తున్నారు. ఇటీవల రాయచోటిలో ఓ షాప్ ఓపెనింగ్ కి అనసూయ వెళ్లారు. పట్టు చీరలో ఆమె పద్దతిగా మెరిసింది. అనసూయను చూసేందుకు రాయచోటి కుర్రాళ్ళు ఎగబడ్డారు. అయితే సాంప్రదాయ కట్టులో కూడా అనసూయ గ్లామర్ పంచింది. అనసూయ హాట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram