Pregnancy: గర్భధారణ సమయంలో తినే ఆహారం విషయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం ప్రభావం శరీరంలోని బిడ్డపై కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. గర్భధారణ సమయంలో హార్మోన్ల వల్ల స్త్రీల శరీరంలో వేర్వేరు మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గర్భంతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీలు బొప్పాయి పండ్లను అస్సలు తీసుకోకూడదు. బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. బొప్పాయికి గర్భాశయ సంకోచంను పెంచే లక్షణాలతో పాటు నెలలు నిండక ముందే ప్రసవం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. గర్భిణీలు మద్యానికి కూడా దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.
మద్యం తాగడం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. మహిళలు ఎవరైతే మద్యం తాగుతారో వారికి గర్భస్రావం జరిగే ఛాన్స్ ఎక్కువని చెప్పవచ్చు. గర్భిణీ మహిళలు పచ్చిగుడ్లను తినకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. గుడ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వచ్చే ఛాన్స్ ఉండటంతో పాటు ఈ బ్యాక్టీరియా వల్ల శిశువుకు హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గర్భధారణ సమయంలో కలబందను అస్సలు తీసుకోకూడదు. కలబందను తీసుకోవడం వల్ల గర్భం పాడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళలు జాగ్రత్తగా ఉంటే మంచిది. గర్బిణీ స్త్రీలలో చాలామంది కాఫీ, టీ ఎక్కువగా తాగుతారనే సంగతి తెలిసిందే. కాఫీ, టీ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డలకు హాని కలుగుతుంది.