Virat Kohli Diet: విరాట్ కోహ్లి అంటే తెలియని వారుండరు. టీమిండియా సారధిగా ఎన్నో సేవలందించాడు. తన కెప్టెన్సీలో ఇండియాకు పలు కప్ లు తీసుకొచ్చాడు. తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆటలో వైవిధ్యం చూపుతో పరుగులు రాబట్టడంలో ముందుంటాడు. జట్టులో కీలకంగా వ్యవహరిస్తూ తోటి వారిలో కూడా మంచి ఉత్సాహం నింపుతాడు.
కోహ్లి తన ఆహార అలవాట్లలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. తన ఫిట్ నెస్ విషయంలో అజాగ్రత్తగా ఉండడు. ఏది పడితే అది తినడానికి ఇష్టపడడు. తన ఫిట్ నెస్ మెయింటెన్ చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు. మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారాలనే తీసుకుంటాడు. దీంతో ఎన్నేళ్లయినా అతడి ఫిట్ నెస్ తగ్గడం లేదు. నిరంతరం ఒకే డైట్ ఫాలో కావడం అతడికే చెల్లు.
కోహ్లి తీసుకునే ఆహారాలేంటో తెలుసా? తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బియ్యం తీసుకుంటాడు. ఇవి ప్రాసెస్ చేయకుండా పాలిష్ పట్టకుండా తీసుకుంటాడు. ఇందులో కార్బోహైడ్రేడ్లు ఉండవు. మినరల్స్ మాత్రమే ఉంటాయి. వీటి ధర కిలో రూ. 400 నుంచి 500 వరకు ఉంటుంది. అంత ధర పెట్టి తన ఆహారం తీసుకోవడం అతడికి అలవాటు. దీంతో తిండి కోసం అంత కేర్ తీసుకుంటాడు.
గత కొన్నేళ్లుగా ఇదే మెయింటెన్ చేస్తున్నాడు. తన తిండి కోసం కోహ్లి అంత శ్రద్ధ తీసుకుంటాడు కాబట్టే అతడి ఫిట్ నెస్ లో మార్పు లేదు. ఒకే తీరుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో మైదానంలో చురుగ్గా కదిలేందుకు దోహదపడుతుంది. ఇలా కోహ్లి తన ఆహారం విషయంలో తీసుకునే జాగ్రత్తలే అతడి ఫిట్ నెస్ ను రక్షిస్తున్నాయి.