Bhadrapada Masam 2023: శ్రావణ మాసం తరువాత వచ్చేది భాద్రపద మాసం. శ్రావణ మాసం మొత్తం పూలజు, ఉపవాసాలతో గడిపిన భక్తులు ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు. అయితే భాద్రపద మాసం కూడా ప్రత్యేకమైనదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసంలోనే వినాయచవితి వస్తుంది. 10 రోజుల పాటు వినాయకుడి సేవలో భక్తులు ఉంటారు. వినాయకచవితి తరువాత పితృదేవతల తర్పణాలు తదితర కార్యక్రమాలను ఈ మాసంలో చేస్తారు. శ్రావణ మాసం కు ఉన్న ప్రత్యేకత భాద్రపదంకు ఉండకపోవచ్చు. కానీ ఈ మాసంలో చేసే ప్రత్యేక కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందామా.
సెప్టెంబర్ 14 అమవాస్యతో పవిత్ర శ్రావణం ముగిసింది. తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ముగిసిన తరువాత భాద్రపదం మొదలవుతుంది. వర్షరుతువు ప్రకారం ఇది రెండోది. ఈ మాసంలో తొలి అర్ధభాగం అంటే పౌర్ణమి వచ్చే వరకు శుక్లపక్షంలో దేవతా పూజలుఉంటాయి. రెండో భాగం అంటే కృష్ణ పక్షంలో పితృదేవతలకు ఆరాధనలు ఉంటాయి. అంటే గతించిన వారికి పిండప్రదానాలు చేస్తుంటారు. పెద్దల కోసం ప్రత్యేకంగా ఈ 15 రోజుల్లోనే ఎక్కువగా నిర్వహిస్తుంటారు.
శుక్లపక్షం కాలంలోనే వినాయకచవితి వస్తుంది. 2023 ఏడాదిలో సెప్టెంబర్ 18న వినాయక చవితి వస్తుంది. అయితే కొందరు 19న నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఈ కాలంలోనే ఉండ్రాళ్ల తద్దె, గౌరీ పూజ నిర్వహిస్తారు. కన్నెపిల్లలు గౌరీ దేవిని పూజించి ఉండ్రాళ్లు సమర్పిస్తే మంచి భర్త వస్తాడని భక్తులు నమ్ముతారు. శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల చతుర్ధశిని జరుపుకుంటారు. ఇందులో శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా భావిస్తారు. ద్వాదశి రోజున వామన జయంతిని నిర్వహిస్తారు. భాద్రపద పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టౌశ్వర్యాలు జరుగుతాయని భావిస్తారు.
భాద్రపద మాసం రెండో భాగం అంటే కృష్ణ పక్షంలో ఎలాంటి పూజలు చేయకూడదని పండితులుచెబుతున్నారు. ఈ సమయం మొత్తం పితృదేవతలను ఆరాధించడానికి ఉపయోగిస్తారని అంటున్నారు. గతించిన వారిని గుర్తుచేసుకుంటూ వారికి పిండప్రదానాలు చేస్తారు. వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం, బ్రాహ్మణులకు బియ్యం, నువ్వులు వంటి ఆహార ధాన్యాలు సమర్పిస్తారు.