IRCTC Goa Package: టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఒక్కసారైనా ‘గోవా’ వెళ్లాలనుకుంటారు. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న ఈ రాష్ట్రం ప్రకృతి అందాలతో విరసిల్లుతుంది. సుందరమైన బీచ్.. ఆహ్లాదాన్ని గొలిపే అడవి ఎంతోమధురానుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంట ఇక్కడికి హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి వారు ఎంజాయ్ చేయడానికి మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను చూడ్డానికి.. ఇక్కడికి వెళ్లడానికి రవాణా సౌకర్యాలు అనువుగా ఉన్నాయి. అయితే హనీమూన్ కోసం గోవాకు వెళ్లాలనుకునేవారికి IRCTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తక్కువ చార్జీలు వేస్తూ వివరాలు చెప్పింది. ఈ ప్యాకేజీ వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం నుంచి గోవా వెళ్లాలనకునేవారికి ‘గోవా డిలైట్’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసింది. దీని ప్రకారం 4 రాత్రులు, 5 రోజుల పాటు వెళ్లొచ్చు. దీని మీద నార్త్ గోవా, సౌత్ గోవాతో పాటు చీచ్ లు, ఇతర పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు. అక్టోబర్ 20న దీనికి సంబంధించిన టూర్ మొదలవుతుంది. ఈరోజున మధ్యాహ్నం 2.55 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.55 గంటలకు గోవా చేరుకుంటారు. ముందుగా ప్యారడైజ్ బీచ్ కు తీసుకెళ్లి అక్కడ హోటల్ ను కేటాయిస్తారు.
మరుసటి రోజు నార్త్ గోవా టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా ఫఓర్ట్ ఆగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ చూపిస్తారు. అయితే ఇక్కడ ఉండే స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొనాలంటే మాత్రం సొంత ఖర్చులనే భరించాలి. ఆ తరువాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా పోర్ట్ సందర్వించవచ్చు. మూడో రోజు గ్యాప్ ఇస్తారు. ఈరోజున మఫ్సా మార్కెట్ లేదా పబ్ కు వెళ్లొచ్చు.
నాలుగోరోజు సౌత్ గోవాకు తీసుకెళ్తారు. ఇక్కడ శ్రీ మంగేషి ఆలయం, ఓల్డ్ గోవా చర్చ్, వాల్డ్ మ్యూజియం చూపిస్తారు. ఐదోరోజు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 3.40 నిమిషాలకు ఫ్లైట్ స్టార్ట్ అయి సాయంత్రం 5.35కు విశాఖలో ల్యాండ్ అవుతుంది. ఈ ప్యాకేజీ లో ఒక్కరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.27,640, డబుల్ ఆక్యుపెన్సీనకి రూ.28,750, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39,010 లో వసూలు చేస్తున్నారు. ఇందులోనే హోటల్ బస, ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. గోవాలో ఏసీ వాహనంలో టూరిస్టులకు వెళ్లొచ్చు.