
Holi: హోలీ పండుగను దేశమంతా ఎంతో వైభవంగా జరుపుకుంటుంది. ఉత్తర భారతదేశంలో హోలీని ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. రంగులు చల్లుకుని కేరింతలు కొడతారు. ధనిక, పేద అనే తేడాలు లేకుండా అందరు ఐకమత్యంగా జరుపుకునేదే హోలీ. దీంతో హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు అందరు ఆసక్తి చూపుతారు. ఆడ, మగ కూడా కలిసే ఉత్సాహంగా కేరింతలు కొడతారు. రంగులు చల్లుకుని ఉల్లాసంగా గడుపుతారు. హోలీ పండుగ నాడు ఇంటిల్లిపాది పండుగలో పాల్గొని నృత్యం చేయడం సహజం.
అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? ఇందులో ఉన్న వాస్తవమేమిటి? దీనికి ఎందుకా పేరు పెట్టారు అనే విషయాల గురించి ఎవరు కూడా పట్టించుకోరు. తమకు నచ్చిన రంగులు చల్లుతూ ఒకరి వెంట మరొకరు పడుతూ కొందరైతే కోడిగుడ్లు నెత్తి మీద కొట్టుకుని తిరుగుతుంటారు. ఇలా హోలీ వేడుకల్లో ఆద్యంతం ఆనందంగా గడుపుతుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం రోజు దేశవ్యాప్తంగా హోలీ జరుపుకుంటారు. వాస్తు ప్రకారం కొన్నినియమాలు పాటిస్తుంటారు. వాస్తు దోషాలు తొలగిపోయేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
Also Read: Central Election Commission- Supreme Court: ఎన్నికల సంఘం నిష్క్రియా పరత్వానికి కారణాలెన్నో?
హోలీ పండుగ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇంట్లో సంతోషాలు వెల్లివిరియాలంటే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద హోలీ పండుగ జరుపుకోవాలి. హోలీ రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులు మాత్రమే వాడాలి. ఇంట్లో హోలీ ఆడటం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది. అందుకే ఇంటి ఆవరణలో హోలీ పండుగ చేసుకునేందుకు ఉత్సాహం చూపించి రంగులు చల్లుకుని ఆడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

హోలీ పండుగ నాడు గణేషుడిని పూజించి గులాబీ రంగును చల్లి స్వీట్లు చేసి మొక్కితే మంచి జరుగుతుంది. విఘ్నాలు లేకుండా చేస్తాడు. హోలీ రోజు ఇలా చేయడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. ఇంట్లోని దోషాలు దూరం చేసుకునేందుకు పాజిటివ్ ఎనర్జీ పెంచుకునేందుకు ఇంటి ఆవరణలో పచ్చని మొక్కలు నాటడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారడానికి ఇంట్లో కానీ ఆఫీసులో కానీ తూర్పున సూర్యుడు ఉదయించే చిత్రం ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
హోలీ రోజు ఇంటి పైన ఏదైనా దేవుడి జెండాను విధిగా ఉంచుకోవాలి. జై హనుమాన్ జెండా అయినా బాలాజీకి సంబంధించిన జెండా అయినా పాతవి ఉంటే తీసేసి కొత్త జెండా ఉంచుకోవడం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది. వాస్తు దోషాలు కూడా తొలగిపోయి మనకు ఎన్నో ప్రయోజనాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ పరిహారాలు పాటించి ఇంట్లో మంచి జరిగేందుకు దోహదపడాల్సిన పరిస్థితులను కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
Also Read: Kodali Nani Arrested: కొడాలి నాని అరెస్టు ఎందుకు? అసలు కేసేంటి? ఎందుకు అరెస్టు చేస్తున్నారు?